టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై సంచలన విషయాలు చెప్పిన నికిషా

First Published 5, Dec 2017, 3:24 PM IST
pawan kalyan hero faced casting couch in tollywood
Highlights
  • తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై నికిషా సంచలన వ్యాఖ్యలు
  • తన తండ్రి టాలీవుడ్ లో పరిస్థితేంటని అడిగితే ఏం చెప్పాలో తెలీలేదన్న నికిషా
  • తాను నటిని కావడం వల్ల బాయ్ ఫ్రెండ్ ను వదిలేసుకున్నానన్న నికిషా

 

హార్వీ వెయిన్‌స్టన్ సంఘటన తర్వాత సినిమా పరిశ్రమల్లో కాస్టింగ్ కౌచ్ పై తరచూ చర్చ జరుగుతోంది. హీరోయిన్లు ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నపుడు కాస్టింగ్ కౌచ్ గురించి తప్పకుండా ఓ ప్రశ్న ఎదురవ్వడం, దానికి వారు తమకు ఎదురైన సంఘటనల గురించి చెప్పడం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ 'కొమురం పులి' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన నికీషా పటేల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ గురించి సంచలన కామెంట్స్ చేశారు.

 

హాలీవుడ్లో హార్వీ వెయిన్‌స్టన్ సంఘటన జరిగినపుడు మా నాన్న నాకు ఫోన్ చేసి టాలీవుడ్లో పరిస్థితి ఏమిటని అడిగారని, అపుడు ఆయనకు ఇక్కడ అలాంటిదేమీ లేదనే సమాధానం చెప్పలేక పోయానని, టాలీవుడ్లోనూ అలాంటి పరిస్థితులు ఉన్నాయని నికీషా పటేల్ తెలిపారు. సెక్సువల్ వేధింపుల విషయంలో హాలీవుడ్ కు, టాలీవుడ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని నికీషా పటేల్ తెలిపారు. అవకాశాల కోసం ఆ విషయంలో కాంప్రమైజ్ కావాలని కోరేవారు చాలా మంది ఇక్కడ ఉన్నారని నికీషా పటేల్ తెలిపారు. అలాంటి అన్ ప్రొఫెషనల్ పీపుల్‌లో ఆడవారు కూడా ఉన్నారని నికీషా వెల్లడించారు.

 

అయితే ఇంస్ట్రీలో నిలదొక్కుకున్న హీరోయిన్లకు అలాంటి వేధింపులు చాలా తక్కువని, బాగా పాపులారిటీ ఉన్నవారు అసలు అలాంటివి ఎదుర్కొని ఉండక పోవచ్చని, అయితే అవకాశాల కోసం స్ట్రగుల్ అయ్యే వారికి మాత్రం ‘కాస్టింగ్ కౌచ్' ఘటనలు తరచూ ఎదురవుతాయని నికీషా పటేల్ తెలిపారు.

 

ప్రతి ఒక్కరూ ఎన్నో డ్రీమ్స్‌ తో ఇండస్ట్రీకి వస్తారు. కొన్ని మంచి సినిమాలు చేసిన తర్వాత కూడా, కొందరు అన్ ప్రొఫెషనల్ వ్యక్తుల కారణంగా నటీమణులు ఆఫర్లు తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. కొందరైతే నటీమణులకు రెస్పెక్ట్ ఇవ్వరు అని నికీషా పటేల్ తెలిపారు.

 

సినిమాల్లోకి రావడానికి ముందు తనకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని, అయితే తాను నటిని కావడం వల్లే తనను వదిలేశాడని నికీషా తెలిపారు. నటిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పి తనను వదిలివెళ్లి పోయాడని నికీషా పటేల్ తెలిపారు.

 

యూకెలో పుట్టి పెరిగిన నికీషా పటేల్ 2010లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘కొమురం పులి' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. అయితే ఆ సినిమా ప్లాప్ కావడంతో అమ్మడి తొలి సినిమాతోనే పెద్ద దెబ్బపడింది. తర్వాత తెలుగులో చేసిన ఓం 3డి, అరకు రోడ్డులో చిత్రాలు కూడా ఆడలేదు. ప్రస్తుతం తమిళంలో 7నాటకల్ అనే సినిమా చేస్తోంది.

loader