తాజాగా పవన్‌ కళ్యాణ్‌ని, దర్శకుడు హరీష్‌ శంకర్‌, నిర్మాత వై.రవిశంకర్‌, నవీన యెర్నేని కలిసి చర్చించారు. సినిమాకి సంబంధించిన వారు అనేక విషయాలను మాట్లాడుకున్నారు. సినిమాని ఎప్పుడు ప్రారంభించాలనేది కూడా ఇందులో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం `భీమ్లా నాయక్‌`, `హరిహర వీరమల్లు` చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. దీంతోపాటు `గబ్బర్‌ సింగ్‌` తర్వాత హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నరు పవన్‌. `#pspk28` గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్ర పోస్టర్‌ సినిమాలపై అంచనాలను పెంచింది. 

తాజాగా పవన్‌ కళ్యాణ్‌ని, దర్శకుడు హరీష్‌ శంకర్‌, నిర్మాత వై.రవిశంకర్‌, నవీన యెర్నేని కలిసి చర్చించారు. సినిమాకి సంబంధించిన వారు అనేక విషయాలను మాట్లాడుకున్నారు. సినిమాని ఎప్పుడు ప్రారంభించాలనేది కూడా ఇందులో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై. రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మించే ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుందని నిర్మాతలు తెలిపారు. ``హరి హర వీరమల్లు` చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమైన తదుపరి తమ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే చిత్రం షూటింగ్ మొదలవుతుంది. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామ`ని నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ లు తెలిపారు.

Scroll to load tweet…

`పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విడుదల అయిన ఈ చిత్రం ప్రచారచిత్రం అభిమానుల అంచనాలను, ఉత్సుకతను మరింత పెంచిన నేపథ్యంలో, చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతోందన్న తాజా సమాచారం అభిమానులకు ఆనందాన్నిస్తుంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అయాంక బోస్ ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్నారు. కళా దర్శకుడు గా ఆనంద సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్, పోరాటాలు రామ్ లక్ష్మణ్ ఇప్పటివరకు ఎంపిక అయిన ప్రధాన సాంకేతిక నిపుణులు` అని తెలిపారు. 

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ఓ పవర్‌ఫుల్‌ టైటిల్‌ వినిపిస్తుంది. `భవదీయుడు భగత్‌సింగ్‌` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. తాజాగా `#pspk28` అప్‌డేట్‌ బయటకు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ టైటిల్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.