Asianet News TeluguAsianet News Telugu

పవన్, హరీష్ శంకర్ చిత్రం రిలీజ్ డేట్..అఫీషియల్ గానే

హరీశ్‌- పవన్‌ కాంబినేషన్‌లో  ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ అనే చిత్రం రాబోతుందంటూ హరీశ్‌శంకర్‌ గతంలో ఓ ప్రకటన ఇచ్చారు. దాంతో, అభిమానులు ఖుషీ అయ్యారు. ఆ ప్రాజెక్టు పేరును ఇటీవల ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’గా మార్చి, పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

Pawan Kalyan, Harish Shankar movie release date
Author
First Published Jan 30, 2023, 7:30 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ఆయన వీరాభిమాని హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించనున్నారు. ఇప్పటికే అధికారికంగా సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడు అయ్యే అవకాసం ఉందనే విషయం కూడా హరీష్ శంకర్ రివీల్ చేసారు. వివరాల్లోకి వెళితే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో "గబ్బర్ సింగ్" అనే సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ ఇన్నాళ్లకు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా ఈ సినిమా కి "భవదీయుడు భగత్ సింగ్" అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ రీసెంట్ గా  ఈ సినిమా కి మరొక టైటిల్ ను ప్రకటించిన చిత్ర టీమ్ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.  "పవన్ కళ్యాణ్ ఇన్ అండ్ యాజ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సారి ఎంటర్టైన్మెంట్ అంతకు మించి ఉంటుంది. షూటింగ్ అతి త్వరలోనే మొదలు అవుతుంది," అంటూ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.  తాజాగా ఈ చిత్రం సంక్రాంతి 2024 విడుదల అవుతుందని హింట్ ఇచ్చారు హరీష్ శంకర్.
 
 హరీష్ శంకర్  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు హరీష్ శంకర్.  ఈ క్రమంలో ఆయన పవన్ కళ్యాణ్ తో చేయబోయే  కి సంబంధించి ఇంతకముందు అభిమానులకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో అలా చేయడం లేదు. కొన్నాళ్లుగా పవన్ ఫ్యాన్స్ ను పెద్ద ఎత్తున ట్విట్టర్ లో బ్లాక్ చేస్తూ వస్తున్నారు హరీష్ శంకర్. ఇదంతా ఫ్యాన్స్ చేసిన అతి వలనే అని చెబుతున్నారు హరీష్ శంకర్. తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒకడిని కావడం వలన.. తన ఎగ్జైట్మెంట్ ను ఇంతకముందు అభిమానులతో పంచుకునేవాడినని.. పవన్ ని కలిసినా, ఒక మంచి డైలాగ్ రాసినా.. ఫ్యాన్స్ తో షేర్ చేసుకునేవాడిని అని హరీష్ శంకర్ చెప్పారు. 

అయితే పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో తాను తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’  (Ustaad Bhagat Singh) గురించి ఇకపై అప్‌డేట్లు ఇవ్వబోనని తెలిపారు. ఆ ప్రాజెక్టు విషయమై కొందరు సోషల్‌ మీడియాలో అతిగా మాట్లాడారు అనేదాన్ని కారణంగా చెప్పారు. తాను డైరెక్ట్‌ చేస్తున్న మూవీ ‘తేరీ’ (తమిళ్‌) రీమేకా, కాదా? అనే విషయాన్ని చెప్పాలనుకున్నానని, పలువురు గీత దాటడంతో ఆగిపోయానని వివరించారు. అభిమానులు తన సోదరుల్లాంటి వారన్న హరీశ్.. ఇతర దర్శకుల్లాకాకుండా ప్రతి విషయాన్ని పంచుకోవాలనుకున్నానని చెప్పారు. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.. ‘తేరీ’ రీమేకో కాదో తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందేనన్నారు. అనుకున్న విధంగా షూటింగ్‌ సాగితే 2024 సంక్రాంతికి సినిమా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ఈ వివరాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో  వైరల్‌గా మారాయి.

 ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రారంభోత్సవానికి ముందు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఇది తమిళ సినిమా ‘తేరి’ రీమేక్ అని, ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేయాలంటూ గొడవ చేశారు. ఈ విషయంలో హరీష్ శంకర్ హర్ట్ అయ్యారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా రీమేకా..? కాదా..? అనేది అఫీషియల్ గా చెప్పకుండానే ఆ రీమేక్ వద్దంటున్నారు.  పవన్ అభిమానుల్లో నిరాశ నెలకొంది. 'తెరి' రీమేక్ వద్దంటే వద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ట్విట్టర్ ట్రెండ్ చేస్తూ తమ గళం వినిపిస్తున్నారు. ఓ అభిమాని అయితే ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాశారు. అయితే  పవన్ - హరీష్ కలయికలో సినిమా వచ్చి పదేళ్లు దాటినా... వాళ్ళ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఎటువంటి కథ అయినా సరే... పవన్ నుంచి అభిమానులు ఆశించే సన్నివేశాలు, డైలాగులు హరీష్ శంకర్ రాస్తారని పవర్ స్టార్ అభిమానుల నమ్మకం.
 

Follow Us:
Download App:
  • android
  • ios