జనసేన పార్టీ చీఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం తన ఇంస్టాగ్రామ్ ఖాతా ప్రారంభించిన సంగతి తెలిసిందే. గంటల వ్యవధిలోనే పవన్ ఇన్స్టాలో మిలియన్ పైగా ఫాలోవర్స్ అందుకున్నారు.

జనసేన పార్టీ చీఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం తన ఇంస్టాగ్రామ్ ఖాతా ప్రారంభించిన సంగతి తెలిసిందే. గంటల వ్యవధిలోనే పవన్ ఇన్స్టాలో మిలియన్ పైగా ఫాలోవర్స్ అందుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య దాదాపు 2.5 మిలియన్లకు చేరుకుంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఇన్స్టా మొట్టమొదటిగా ఎలాంటి పోస్ట్ పెడతారు అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. 

నిరీక్షణకు తెరదించుతూ పవన్ తన మొదటి ఇన్స్టా పోస్ట్ చేశారు. ఎవరూ ఊహించని విధంగా పవన్ బ్యూటిఫుల్ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సినీ దిగ్గజాలతో ఉన్న అనుబంధం.. తన సహచర నటులతో గడిపిన క్షణాలకి సంబందించిన ఫోటోలని పంచుకున్నారు. బ్యాగ్రౌండ్ లో బ్యూటిఫుల్ మ్యూజిక్ ప్లే అవుతుండగా పవన్ సినీ జర్నీకి సంబంధించిన దృశ్యాలు ప్రవాహంలా వెళుతూ ఉంటాయి. 

ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున, ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్,మహేష్ బాబు లతో ఉన్న ఫోటోలు.. అలాగే సూపర్ స్టార్ కృష్ణ, దాసరి నారాయణరావు, ఎమ్మెస్ నారాయణ లాంటి లెజెండ్స్ తో ఉన్న దృశ్యాలని కూడా పంచుకున్నారు. 

View post on Instagram

ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ లో ఆన్ లొకేషన్ పిక్స్ కూడా చూడవచ్చు. ఇప్పటికే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పవన్ ఫస్ట్ ఇన్స్టా పోస్ట్ కి గంట వ్యవధిలోనే 5 లక్షల వరకు లైక్స్ లభించాయి. సెలెబ్రిటీలు కూడా పవన్ ఫస్ట్ ఇన్స్టా పోస్ట్ పై స్పందిస్తున్నారు. 

ఈ పోస్ట్ కి పవన్ కళ్యాణ్.. మన బంధం ఇలాగే కొనసాగాలని మరెన్నో మధుర జ్ఞాపకాలు పంచుకోవాలని ఆసిస్తూ.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ లో పవన్ ఎలాంటి రాజకీయ అంశాలకి తావివ్వలేదు.