బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ పొలిటికల్ కామెంట్స్ తో ఫ్యాన్స్ నింపేశారు. సీఎం సీఎం నినాదాలతో వేదికను హోరెత్తించారు.  

పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో. ఈ సోషియో ఫాంటసీ సోషల్ డ్రామా విడుదలకు సిద్ధమైంది. జులై 28న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నేడు ప్రీ రిలీజ్ వేడుక ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో భారీగా వర్షాలు పడుతుండగా శిల్పకళా వేదికలో కొద్దిమంది అభిమానుల మధ్య వేడుక నిర్వహిస్తున్నారు. 

బ్రో ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో పాటు హీరోయిన్స్, చిత్ర యూనిట్, అతిథులు హాజరు కావాల్సి ఉంది. వేడుక పూర్తి స్థాయిలో ప్రారంభం కావడానికి ముందు యాంకర్ పవన్ కళ్యాణ్ అభిమానులతో ముచ్చటించారు. సాంగ్ అద్భుతంగా పాడిన ఒక అభిమానికి గిఫ్ట్ ఉందని వెల్లడించారు. అయితే మైక్ అందుకున్న ఫ్యాన్స్ పాలిటిక్స్ డైలాగ్స్ కొట్టారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. 2024లో పవన్ కళ్యాణ్ సీఎం అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. 

బ్రో సినిమా వేడుక కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఏపీ సీఎం జగన్ టార్గెట్ గా కొందరు డైలాగ్స్ కొట్టారు. పవన్ అభిమానులు మైక్ లో చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గతంలో మూవీ ఈవెంట్స్ లో పొలిటికల్ స్పీచ్లు ఇచ్చిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ టికెట్ ధరల విషయంలో ఏపీ గవర్నమెంట్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

మరి నేటి బ్రో రిలీజ్ వేడుకలో ఆయన సీఎం జగన్ టార్గెట్ ఏమైనా కామెంట్స్ చేస్తారా లేదా? అనేది చూడాలి. బ్రో మూవీ తమిళ చిత్రం వినోదయ సితం రీమేక్. ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన సముద్ర ఖని తెలుగులో కూడా తెరకెక్కించారు. త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు. కథలో కూడా మార్పులు చేసినట్లు సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. ఊర్వశి రాతెలా స్పెషల్ సాంగ్ చేశారు... 

YouTube video player