ఏడాది వ్యవధిలో పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు విడుదల చేసినా ఫ్యాన్స్ సంతోషంగా లేరు. పవన్ ఇమేజ్ కి ఏమాత్రం సెట్ కానీ రీమేక్ చిత్రాలు కావడంతో వారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఒకపక్క పవన్ ఎలాంటి చిత్రం చేసినా చూస్తాం అంటూనే, సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ (Pawan Kalyan) ఫ్యాన్స్ ఇతరుల పెత్తనాన్ని ఒప్పుకోరు. ఎవరైనా మా హీరో తర్వాతే అంటారు. పవన్ భక్తులు సోషల్ మీడియాలో డంబాలు పలుకుతున్నా రియాలిటీలో మిగతా స్టార్ హీరోలతో పోల్చితే ఆయన ఎక్కడో ఉన్నారు. ఆయన కమ్ బ్యాక్ చిత్రాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ (Bheemla Nayak)నష్టాలు మిగిల్చాయి. తెలంగాణలో బ్రేక్ ఈవెన్ మాత్రమే సాధించిన భీమ్లా నాయక్, ఏపీలో నష్టాలు మిగిల్చింది. ఇక వరుసగా రీమేక్ చిత్రాలు చేస్తున్న పవన్ పై ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. యాంటీ ఫ్యాన్స్ తమని ట్రోల్ చేస్తుంటే తట్టుకోలేకున్నారు.
పవన్ వరుసగా రీమేక్ చిత్రాలు చేస్తుండగా వారు అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఫ్యాన్ వార్ లో పవన్ అభిమానులు అవమానాలకు గురవుతున్నారు. అదే సమయంలో రీమేక్ చిత్రాలు పట్ల అసహనం వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. ప్రభాస్ ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నారు. పుష్ప విజయంతో అల్లు అర్జున్, ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్, చరణ్ కూడా పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో చేరారు.
వీరందరి కంటే ముందు స్టార్ డమ్ సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ మాత్రం రేసులో వెనకబడిపోయారు. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) చిత్రంతో పవన్ పాన్ ఇండియా హీరోగా అవతరించాలని వారు కోరుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ విజయంతో లెక్కలన్నీ మారిపోయాయి. ఇక దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు పైనే పవన్ ఫ్యాన్స్ అసలు పెట్టుకున్నారు. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ కథగా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు పర్ఫెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్టు. అలాగే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.
దీంతో ఈ ప్రాజెక్ట్ పవన్ ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకున్నారు. అలాగే ఈ మూవీతో పవన్ బాక్సాఫీస్ రికార్డ్స్ కొల్లగొట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిష్ కి సోషల్ మీడియాలో అభ్యర్ధనలు పెడుతున్నారు. హరి హర వీరమల్లు ఎక్కడా తగ్గకుండా ప్రతిష్టాత్మకంగా తెరక్కించాలని, పవన్ కి భారీ పాన్ ఇండియా హిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి పవన్ అభిమానుల డిమాండ్ క్రిష్ ఎంత వరకు నెరవేరుస్తాడో చూడాలి.