పవన్ కమ్ తర్వాత వరుసగా రెండు రీమేక్స్ చేశారు. మరో రెండు మూడు రీమేక్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. పవన్ వరుసగా రీమేక్స్ చేయడం ఫ్యాన్స్ లో చాలా మందికి ఇష్టం లేదు. అయితే వారు ఓ రీమేక్ కోరుకుంటున్నారు.


అటు రాజకీయాలు ఇటు సినిమాలు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ది రెండు పడవల ప్రయాణం. ఈ క్రమంలో ఆయన సినిమాల ఎంపిక తడబడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయాలని ఆయన భావిస్తున్నారు. దానికి రీమేక్స్ సరైన మార్గంగా ఎంచుకుంటున్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలకు చాలా తక్కువ డేట్స్ ఆయన కేటాయించారు. కరోనా లేకుంటే ఈ రెండు చిత్రాలు ఇంకా త్వరగా పూర్తయ్యేవి. ముందుగా ఒప్పుకున్న చిత్రాలను సైతం పక్కనపెట్టి భీమ్లా నాయక్ చేశారు. 

ప్రస్తుతం హరి హర వీరమల్లు (Harihara Veeramallu)మూవీ షూటింగ్ లో పవన్ పాల్గొంటున్నారు. భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే భవదీయుడు భగత్ సింగ్ కి ముందు వినోదయా సిత్తం అనే తమిళ రీమేక్ చేయాలని పవన్ భావించారు. ఈ చిత్ర రీమేక్ పట్ల ఫ్యాన్స్ లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అసలు పవన్ ఇమేజ్ కి ఏమాత్రం సెట్ కాని ఈ చిత్రం చేయవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. 

వినోదయా సిత్తంతో పాటు పవన్ తేరి రీమేక్ చేస్తున్నట్లు వార్తలొస్తుండగా... దాదాపు ఖాయమే అంటున్నారు. విజయ్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ తేరి తమిళ్ లో మంచి విజయం సాధించింది. హీరో పోలీస్ కాగా హీరో ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఈ కథ పవన్ కి బాగా సెట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తేరి తెలుగు వెర్షన్ విడుదలైనప్పటికీ పవన్ రీమేక్ చేయడంలో తప్పే లేదంటున్నారు. 

పవన్ తేరి రీమేక్ చేస్తే గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ పడుతుందంటున్నారు. కాగా ఈ చిత్ర రీమేక్ కి సర్వం సిద్దమవుతుందట. దర్శకుడు సుజీత్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. డివివి దానయ్య నిర్మాతగా ఈ క్రేజీ రీమేక్ పట్టాలెక్కనుందనేది టాలీవుడ్ టాక్. దబంగ్ మూవీ రిమేక్ గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తేరి సైతం మంచి విజయం సాధిస్తుందనడంలో సందేహం లేదు.