Asianet News TeluguAsianet News Telugu

ట్రైలర్ కోసమే ఇంత రచ్చా... థియేటర్ డోర్ పగులగొట్టిన పవన్ ఫ్యాన్స్!

వైజాగ్ లోని సంగం శరత్ థియేటర్ లో కూడా వకీల్ సాబ్ ట్రైలర్ ప్రదర్శన జరిగింది. అయితే థియేటర్ లోపలి వెళ్లే సమయంలో ఫ్యాన్స్ మధ్య తోపులాట మొదలైంది. ఈ క్రమంలో థియేటర్ గ్లాస్ డోర్ పగిలిపోయింది. దీనితో కొందరు ఫ్యాన్స్ క్రింద పడిపోగా, వాళ్ళ పైనుండే మిగతా ఫ్యాన్స్ నడుచుకుంటూ థియేటర్ లోకి వెళ్లారు. 

pawan kalyan fans breaks theatre glass door in the rush of vakeel saab trailer  ksr
Author
hyderabad, First Published Mar 30, 2021, 12:27 PM IST


పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కోసం ఎంతకైనా తెగించే వీరాభిమానం వారి సొంతం. జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ సినిమా వస్తుందంటే థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ పోటెత్తుతారు. పవన్ సినిమా టికెట్ కోసం చొక్కాలు చించుకుంటారు. ఈ సారి సినిమా కోసం కాదు కేవలం ట్రైలర్ కోసమే పెద్దగా హంగామా సృష్టించారు పవన్ అభిమానులు. 


నిన్న హోలీ పండుగను పురస్కరించుకొని వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.  సాయంత్రం ఆరు గంటలకు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల కావడం జరిగింది. అయితే ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న నేపథ్యంలో రెండు గంటల ముందే సాయంత్రం నాలుగు గంటలకు రెండు తెలుగు రాష్ట్రాలలోని కొన్ని థియేటర్స్ లో వకీల్ సాబ్ ట్రైలర్ ప్రత్యేకంగా ప్రదర్శన చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు రెండు గంటలకే అక్కడు చేరుకొని పవన్ కట్ అవుట్ కి పూజలు, పాలాభిషేకాలు చేశారు. 


కాగా వైజాగ్ లోని సంగం శరత్ థియేటర్ లో కూడా వకీల్ సాబ్ ట్రైలర్ ప్రదర్శన జరిగింది. అయితే థియేటర్ లోపలి వెళ్లే సమయంలో ఫ్యాన్స్ మధ్య తోపులాట మొదలైంది. ఈ క్రమంలో థియేటర్ గ్లాస్ డోర్ పగిలిపోయింది. దీనితో కొందరు ఫ్యాన్స్ క్రింద పడిపోగా, వాళ్ళ పైనుండే మిగతా ఫ్యాన్స్ నడుచుకుంటూ థియేటర్ లోకి వెళ్లారు. కేవలం ట్రైలర్ కోసమే ఈ స్థాయిలో ఫ్యాన్స్ ఆరాటపడుతుంటే, ఇక సినిమా కోసం వీళ్ళు ఇంకెంత హంగామా సృష్టిస్తారో అని అందరూ అనుకుంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios