పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు రెచ్చిపోయి రచ్చ చేశారు. కర్నూల్ లోని ఓ థియేటర్ అద్ధాలు ద్వంసం చేశారు. రాళ్ల దాడి చేసి నానా బీభత్సం సృష్టించారు. ఇంతకీ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇంత కోపం ఎందుకు వచ్చింది. 

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు గురువారం క‌ర్నూలులోని శ్రీరామ టాకీస్‌పై రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో థియేట‌ర్ అద్దాలు పూర్తిగా ధ్వంస‌మయ్యాయి. ఈ ఘ‌ట‌న‌ జరగడంతో థియేట‌ర్ దగ్గర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంట అంటే.. ఈరోజు (02, శుక్ర‌వారం) ప‌వ‌న్ క‌ల్యాణ్ బర్త్ డే సందర్భంగా... ఓ రోజు ముందుగానే ఆయ‌న హీరోగా నటించి సూపర్ హిట్ సాధించిన సినిమా జల్సాను 4K లో మరోసారి రిలీజ్ చేశారు. ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభించింది. 

ఈ సినిమా రిలీజ్ లో భాగంగా.. కర్నూల్ లోని శ్రీరామ థియేట‌ర్‌ లో కూడా సినిమాను ప్రదర్శించారు. అయితే అక్కడ కు భారీ ఎత్తున తరలి వచ్చిన పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్.... సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా థియేట‌ర్‌లో సౌండ్ సిస్ట‌మ్ స‌రిగా లేద‌ని అభిమానులు ఆందోళ‌న‌కు దిగారు. చాలా సేపు ఆందోళనలు చేసిన ఈ క్ర‌మంలోనే... సహనం కోల్పోయిన ఫ్యాన్స్.. థియేట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చి రాళ్ల‌తో థియేట‌ర్‌పైకి దాడికి దిగారు. 

ఇక ఈ దాడిలో థియేట‌ర్ పాక్షికంగా ధ్వంస‌మైంది. ఎక్కడికక్కడ అద్దాలు పగిలి చెల్లా చెదురుగా పడిపోయాయి. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. అక్కడ ఆందోళన చేస్తున్న వారి బైక్ లు కోన్ని సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. ఆదోళనలు ఎక్కువ కాకుండా థియేటర్ దగ్గర భారీగా పోలీస్ బంధో బస్త్ ను ఏర్పాటు చేశారు. 

పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఫ్యాన్స్ తెగ హడావిడి చేస్తున్నారు. వారం ముందు నుంచే ప్లెక్సీలు..బ్యానర్లతో సందడి చేస్తున్నారు. ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన జల్సా సినిమా .. స్పెషల్ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో ఉదృతంగా ప్రచారం చేశారు. అంతే కాదు ఈ సినిమా ఎన్నో సార్లు టీవీలో ప్రసారం అయినా సరే.. థియేటర్ లో మళ్లీ చూడటానికి అభిమానులు క్యూ కట్టారు. ఇక ఈరోజు జల్సా రిలీజ్ అయిన థియేటర్లు దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది.