పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియా పోస్ట్ సంచలనం రేపుతోంది. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ ఆమె సడన్ షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ఆరోగ్యం గురించి చేసిన సోషల్ మీడియా పోస్ట్ పలు అనుమానాలకు దారితీసింది. ఆమె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నానని కామెంట్ చేశారు. రేణు దేశాయ్ పోస్ట్ ఒక్కసారిగా కలకలం రేపింది. రేణు దేశాయ్ ఇంస్టాగ్రామ్ లో ''నా సన్నితులకు నా ఆరోగ్య సమస్యల గురించి తెలుసు. కొన్నాళ్లుగా నేడు హృదయ, ఇతర సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయం బహిర్గతం చేయడానికి కారణం... నాలాగే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లలో మనో ధైర్యం నింపాలని.
విచారం చెందకండి. విశ్వాసం కోల్పోకుండా దృఢంగా ఉండండి. ఈ ప్రపంచం మనకోసం అందమైన ప్రణాళికలు వేసి ఉంటుంది. నవ్వుతూ బ్రతికేయండి. వ్యాధికి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మంచి ఆహారం తీసుకుంటూ యోగా, వ్యాయామం చేస్తున్నాను. ఈ సమస్యను ఎదిరించి బయటపడతాను'' అని రేణు దేశాయ్ సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్ అభిమానుల్లో ఆందోళన నింపింది. అసలు రేణు దేశాయ్ కి వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్ ఏంటనే అనుమానాలు పెరిగాయి. గుండె సమస్య అన్నారు కానీ క్లారిటీ ఇవ్వలేదు.
ఆమెకు వచ్చిన ఇబ్బంది ఏదైనా కానీ, కోలుకొని బయటపడాలని అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఇటీవలే రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. పెళ్లయ్యాక నటనకు గుడ్ బై చెప్పిన ఆమె కమ్ బ్యాక్ ఇచ్చారు. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణు దేశాయ్ కీలక రోల్ చేస్తున్నారు. ఆమె లుక్ కూడా విడుదల చేశారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. టైగర్ నాగేశ్వరరావు మూవీపై ఆడియన్స్ లో హైప్ ఉంది. ఈ సంవత్సరం టైగర్ నాగేశ్వరరావు విడుదల కానుంది.
కాగా రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్ 2012లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. వీరికి అకీరా, ఆద్య ఇద్దరు సంతానం. పిల్లలు రేణు వద్దే పెరిగి పెద్దయ్యారు. విడాకుల అనంతరం పూణేలో రేణు దేశాయ్ మకాం పెట్టారు. ఓ రెండేళ్ల క్రితం హైదరాబాద్ కి రావడం జరిగింది. విడాకులు తీసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ సన్నిహిత సంబంధాలు నడుపుతున్నారు. ఇటీవల అకీరా హై స్కూల్ గ్రాడ్యుయేషన్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పవన్-రేణు దేశాయ్ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.
