కబ్జా మూవీ టీమ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు టాలీవుడ్ పవర్ స్టార పవన్ కళ్యాణ్ . ఈమూవీ ఆడియో ఫంక్షన్ కు  గెస్ట్ గా రావల్సి ఉండగా.. రాలేకపోతున్నందకు బాధపడుతున్నానంటూ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు పవర్ స్టార్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, కిచ్చ సుదీప్ కలిసి నటిస్తున్న సినిమా కబ్జ. ఈమూవీని కన్నడతో పాటు పలు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు టీమ్. ఈక్రమంలో కన్నడ తరువాత తెలుగును టార్గెట్ చేసింది టీమ్. దాంతో ఆడియో రిలీజ్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు టీమ్. అయితే ఈ ఆడియో ఫంక్షన్ కు తాను రాలేకపోతున్నానని..దానికిబాధగా ఉన్నా తప్పడంలేదు అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగాప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. 

ప్రెస్ నోట్ లో పవర్ స్టార్ ఈ విధంగారాసుకొచ్చారు. కబ్జ ఆడియో రిలీజ్ కు ముఖ్య అతిథిగా పిలిచినందుకు టీమ్ మొత్తానికి ధన్యవాదాలు. అయితే అనుకోని విధంగా ఈకార్యక్రమానికి రాలేకపోతున్నందకు బాధపడుతన్నాను. పొలిటికల్ మీటింగ్స్ తో బిజీగా ఉన్నందువల్ల ఈకార్యక్రమానికి రాలేకపోతున్నాను అన్నారు. ఇక కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, సుధీప్ లకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు.. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు పవర్ స్టార్. ఇంగ్లీష్ తో పాటు కన్నడాలో కూడా ఈ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు టీమ్. 

ఉపేంద్ర, సుదీప్ కలిసి నటిస్తున్న ఈసినిమాలో శ్రీయాశరణ్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. వీరితో పాటు పోసాని కృష్ణ మురళీ, మురళీ శర్మలాంటి సీనియర్లు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఆర్ చంద్రు డైరెక్టర్ చేస్తూ.. స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాను ప్రపంచ వ్యాప్తంగా మార్చ్ 17న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్లు జోరుగాసాగిస్తున్నారు టీమ్. ఉపేంద్రతో పాటు..సుదీప్ కూడా ప్రచారాన్ని సాగిస్తున్నారు. టాలీవుడ్ లో కూడా సాలిడ్ హిట్ కొట్టాలని పక్కా ప్లాన్ తో ఉన్నారు టీమ్.

ఇక ఇప్పటికే టాలీవుడ్ లో కూడా మంచి ఇమేజ్ సాధించారు ఉపేంద్ర,సుధీప్. హీరోలుగా మాత్రమే కాదు...నెగెటీవ్ పాత్రలు కూడా చేసి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోయారు. ఈక్రమంలోనే కబ్జా సినిమాకు ఈ ఇమేజ్ ఉపయోగపడుతుంది అని నమ్మకంతో ఉన్నారు టీమ్. ఇప్పటికే సుదీప్ కన్నడ నాట నుంచి సోలో హీరోగా పాన్ ఇండియాకు వెళ్ళాడు. ఇక ఉపేంద్రతో కలిసి ఈసారి సాలిడ్ హిట్ కొట్టాలని రెడీ అవుతున్నాడు.