మొదటి ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వస్తారని 'ఆహా' వర్గాల అనుకున్నారు. కానీ చంద్రబాబు వచ్చారు.  ఇప్పుడు రాబోయే ఎపిసోడ్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు గురూజీ సందడి చేయనున్నారని సమాచారం. ఆ ఎపిసోడ్ మాగ్జిమం చివర్లో వచ్చే అవకాసం ఉందని అంటున్నారు.

 నట సింహం నందమూరి బాలకృష్ణ చేస్తున్న 'అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే' ప్రారంభ ఎపిసోడే పెద్ద హిట్ అయ్యింది. చంద్రబాబుతో మొదటి ఎపిసోడ్ కు శ్రీకారం చుట్టి సెన్సేషన్ చేసారు. ఇప్పుడు అలాంటి మరో ఎపిసోడ్ కు రంగం రెడీ అవుతోంది. మొదటి ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వస్తారని 'ఆహా' వర్గాల అనుకున్నారు. కానీ చంద్రబాబు వచ్చారు. ఇప్పుడు రాబోయే ఎపిసోడ్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు గురూజీ సందడి చేయనున్నారని సమాచారం. ఆ ఎపిసోడ్ మాగ్జిమం చివర్లో వచ్చే అవకాసం ఉందని అంటున్నారు.

 'ఆహా'లో గీతా ఆర్ట్స్ అథినేత, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భాగస్వామి. ఆయన చిరంజీవికి బావమరిది. పైగా, మంచి స్నేహితులు. కాబట్టి చిరంజీవిని తీసుకు రావడం పెద్ద కష్టం ఏమీ కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రప్పించవచ్చు. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్దితుల్లో .. చిరు కాకుండా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ వస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ముందుకు వెళ్లారని తెలుస్తోంది.

YouTube video player

మామూలుగా సినిమా విడుదల సమయంలో ఇంటర్వ్యూలు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడరు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీడియా ముందుకు ఎక్కువ సమయం వస్తున్నారు గానీ... అంతకు ముందు ఆయన కనిపించింది తక్కువ.ఇప్పుడు చంద్రబాబు ఎపిసోడ్ తో ..'అన్‌స్టాప‌బుల్‌' షోలో రాజకీయాలతో పాటు సినిమా ముచ్చట్లు కూడా ఉంటాయని క్లారిటీ వచ్చేసింది. అందువల్ల, త్రివిక్రమ్ ద్వారా పవన్ కళ్యాణ్‌కు ప్రతిపాదన పంపించారు. దాంతో పవన్ కళ్యాణ్ షోకి రావడానికి ఇద్దరూ సూత్రప్రాయంగా అంగీకరించారని సమాచారం. ఈ మేరకు బాలయ్య...త్రివిక్రమ్ కు ఫోన్ చేసి, మన షోకు రావాలి ..ఎవరితో రావాలో తెలుసుగా అన్నారు. ఎవరితో అనగానే అందరికీ అర్దమైపోయింది.

ఇక ఇందులో జనసేన కు సంభందించిన విషయాలు ఉంటాయని వేరే చెప్పక్కర్లేదు. జనసేన పెట్టాలనే ఆలోచన రావటం...దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ వంటివి చర్చకు పెడతారట. అలాగే పవన్ కళ్యాణ్ కు సినిమాలపై ఉన్న అభిప్రాయం, ప్రేమ, ఆయన దర్శకత్వం వంటి విషయాలు ఈ ఎపిసోడ్ లో ఉంటాయంటున్నారు.

ఏదైమైనా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ అన్‌స్టాప‌బుల్‌' షోకి వస్తే... కచ్చితంగా ఆ ఎపిసోడ్ భారీ హిట్ అవుతుంది. అలాంటి అవకాసం ఆహా ఎందుకు వదులుకుంటుంది. సర్వర్స్ జామ్ అయ్యిపోయే రీతిలో ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఏదైమైనా బాలయ్య కొత్త గా కనిపిస్తున్నారు..మాట్లాడుతున్నారు. ఉత్సాహం అందిస్తున్నారు.