Asianet News TeluguAsianet News Telugu

కృష్ణం రాజు భౌతిక కాయానికి నివాళులర్పించిన పవన్.. ప్రభాస్ కి ఓదార్పు

రెబల్ స్టార్ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణం రాజు మృతితో టాలీవుడ్ మొత్తం విషాదంలో మునిగిపోయింది. దాదాపు 60 ఏళ్ళకి పైగా కృష్ణం రాజు సినీ కెరీర్ కొనసాగింది.

Pawan Kalyan condolence to Krishnam Raju Death
Author
First Published Sep 11, 2022, 1:43 PM IST

రెబల్ స్టార్ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణం రాజు మృతితో టాలీవుడ్ మొత్తం విషాదంలో మునిగిపోయింది. దాదాపు 60 ఏళ్ళకి పైగా కృష్ణం రాజు సినీ కెరీర్ కొనసాగింది. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో నటించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణం రాజు ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. 

రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కృష్ణం రాజు కూర్చునే ప్రసంగించారు. కాకపోతే అప్పుడు ఆయన కాస్త హుషారుగా కనిపించారు. ఆసుపత్రి నుంచి ఆయన భౌతిక కాయాన్ని నివాసానికి తరలించారు. సినీ రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా తరలివెళ్లి కృష్ణం రాజు పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కృష్ణం రాజు కి నివాళులు అర్పించారు. 

అక్కడే ఉన్న ప్రభాస్ ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం ప్రభాస్.. పవన్ కళ్యాణ్ ని తన కుటుంబ సభ్యుల వద్దకు తీసుకువెళ్లారు. కృష్ణం రాజు కుటుంబ సభ్యులని కూడా పరామర్శించిన తర్వాత పవన్ అక్కడే ఉన్న మోహన్ బాబుతో కాసేపు మాట్లాడారు. 

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. చెన్నైలో కృష్ణం రాజు గారు ఉంటున్న వీధిలోనే తాము కూడా ఉండేవాళ్ళం అని పవన్ గుర్తు చేసుకున్నారు. మా ఫ్యామిలీతో ఎంతో సన్నిహితంగా ఉండే హీరో కృష్ణం రాజు గారు మాత్రమే అని అన్నారు. కృష్ణం రాజు గారు, ఆయన సతీమణి ఇద్దరూ తనపై ప్రేమ వాత్సల్యం చూపించేవారు అని అన్నారు. 

అందరి మంచిని కోరుకునే వ్యక్తి కృష్ణం రాజు గారు మరణించడం బాధని కల్గించే అంశం. ప్రభాస్ గారికి , వారి సోదరీమణులకు , కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. కృష్ణం రాజు గారిఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా అని పవన్ కళ్యాణ్ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios