Asianet News TeluguAsianet News Telugu

నిర్మాతలకు పవన్ కళ్యాణ్‌ కండీషన్స్.. `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` పక్కకెళ్లి ఆడుకోవాల్సిందేనా?

పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న నేపథ్యంలో మళ్లీ సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన నిర్మాతలకు కొత్త కండీషన్‌ పెట్టాడట. 
 

pawan kalyan conditions to producers but ustaad bhagatsingh shelved ? arj
Author
First Published Aug 24, 2024, 5:26 PM IST | Last Updated Aug 24, 2024, 5:36 PM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. ఇప్పుడు పవర్‌లో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు తనకు పవర్‌ లేదు, ఎందుకు పవర్‌ స్టార్‌ అని పిలుస్తున్నారని వాపోయారు. కానీ ఇప్పుడు పవర్‌లోకి వచ్చి తన సత్తా చాటుతున్నాడు. అధికారులను పరుగులు పెట్టిస్తున్నాడు. సమస్యల పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నకారణంగా ఆ ప్రభావం ఇప్పుడు సినిమాలపై  పడుతుంది. ఆయన నటించాల్సిన సినిమాల షూటింగ్‌లు ఎప్పుడు పూర్తవుతున్నాయి. పవన్‌ ఎప్పుడు షూటింగ్‌ల్లో పాల్గొంటాడనేది పెద్ద సస్పెన్స్ గా మారింది.  

ఆ మధ్య పవన్‌ కళ్యాణ్‌ అధికారంలోకి వచ్చాక స్పందిస్తూ, రెండు మూడు నెలల తర్వాత షూటింగ్‌లపై ఫోకస్‌ పెడతానని తెలిపారు. తనని నమ్మి ఓటు వేసి వారికోసం ఎంతో కొంత చేసి ఆ తర్వాత సినిమాలు పూర్తి చేస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. తాజాగా నిర్మాతలు పవన్‌ని కలిశారు. `హరిహర వీరమల్లు` సినిమా నిర్మాత ఏఎం రత్నం పవన్‌ కళ్యాణ్‌ని కలిసి సినిమా షూటింగ్‌పై చర్చించినట్టు తెలిపారు. త్వరలోనే ఆయన సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్టు హింట్‌ ఇచ్చారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ కూడా జరుగుతుందట. పవన్ లేని సీన్లు చేస్తున్నారని తెలుస్తుంది. 

మరోవైపు `ఓజీ` నిర్మాత కూడా కలిశారు. `ఓజీ` దర్శకుడు సుజీత్‌, నిర్మాత డీవీవీ దానయ్య పవన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి మధ్య సినిమా షూటింగ్‌కి సంబంధించిన చర్చలు జరిగాయట. ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే పవన్‌ `ఓజీ` షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడని తెలిసింది. అయితే ఈ చర్చల్లో నిర్మాతలకు ఓ కండీషన్‌ పెట్టాడట పవన్‌. ఆయన ప్రస్తుతం ఏపీలోనే ఉంటున్నారు. పరిపాలనకు సంబంధించిన పనుల్లో బిజీ నేపథ్యంలో అక్కడే ఉండాల్సి వస్తుంది. 

అయితే ఆగిపోయిన సినిమాలను తిరిగి ప్రారంభించేందుకు, ఆయా షూటింగ్‌లు పూర్తి చేసేందుకు పవన్‌ ఓ ఐడియా ఇచ్చాడట. తాడెపల్లి పరిసరాల్లో ఈ మూవీలకు సంబంధించిన సెట్‌ లు వేసుకోమని తెలిపారట. తనకు‌ పాజిబుల్‌ అయిన టైమ్‌ని బట్టి షూటింగ్‌ల్లో పాల్గొనేలా ఏర్పాటు చేసుకుంటానని తెలిపినట్టు టాక్‌. `ఓజీ`, `హరిహర వీరమల్లు` సినిమాల సెట్‌లు అక్కడ వేయించుకోమని తెలిపాడట పవన్‌. ఎవరైతే ఆ పని చేస్తారో, వారికి ముందుగా డేట్స్ ఇవ్వనున్నట్టు చెప్పినట్టు సమాచారం. దీనికి ఇద్దరు నిర్మాతలు సుముఖతని వ్యక్తం చేసినట్టు టాక్‌. `హరిహర వీరమల్లు`, `ఓజీ` నిర్మాతలు ఈ విషయంలో ఆసక్తికరంగా ఉన్నారు. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు హరీష్‌ శంకర్ చేయాల్సిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`పై పెద్ద సస్పెన్స్ నడుస్తుంది. ఇటీవల కాలంలో ఈ నిర్మాతలు పవన్ ని కలిసింది లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? ఆగిపోతుందా అనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇటీవలే రవితేజ హీరోగా `మిస్టర్‌ బచ్చన్‌` సినిమా చేశాడు హరీష్‌. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇది `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`పై ప్రభావాన్ని చూపించబోతుందనే టాక్‌ స్టార్ట్ అయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందా? ఆగిపోతుందా? అనేది సస్పెన్స్ గా మారింది. ఏం జరగబోతుందనేది మున్ముందు చూడాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios