Asianet News TeluguAsianet News Telugu

‘నా విజ్ఞత, సంస్కారం మాట్లాడకుండా ఆపేశాయి’.. మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ క్లారిటీ?

నందమూరి బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే2’ షోలో పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ తొలిసారిగా తన మూడు పెళ్లిళ్ల గొడవపై స్పందించారు. బాలయ్య అడిగిన ప్రశ్నకు పవన్  క్లారిటీ ఇచ్చారు. 
 

Pawan Kalyan clarity on three marriages?
Author
First Published Jan 27, 2023, 8:59 PM IST

‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2’ నుంచి బాలయ్య - పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు సంబంధించిని పార్ట్ - 1 ప్రోమో విడుదలైంది. ప్రస్తుతం నెట్టింట దూసుకెళ్తోంది. అయితే ఈ షో వేదికగా టాలీవుడ్ స్టార్స్ ను, ప్రముఖ పొలిటీషన్స్ ను బాలయ్య ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తాజాగా షోకు హాజరు కావడం ఎప్పటి నుంచో పవన్ ను ఇబ్బంది పెడుతున్న ఓ ప్రశ్నను అడిగారు. దానికి ఆయన కూడా బదులిచ్చారు. 

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆయనకు ఇదే ప్రశ్న ఎదురవుతోంది. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఆయన సభలో ఖండించారు. చట్టప్రకారమే అలా చేశానంటూ బదులిచ్చిన విషయం తెలిసిందే.  ఇక తాజాగా బాలయ్య షోలోనూ అదే ప్రశ్న ఎదురైంది. పెళ్లిళ్ల గొడవేంటి బయ్యా.. అని బాలయ్య అడగా.. వాళ్లు బాధపడతారేమో అని అంటూ.. నా విజ్ఞత, సంస్కారం మాట్లాడకుండా ఆపేస్తుందని అన్నారు. దీనిపై మరింతగా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

దీంతో తొలిసారిగా స్పందిస్తుండటం ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇచ్చే సమాధానం విమర్శకుల నోర్లు మూయిస్తుందా  చూడాలి. బాలయ్య - పవన్‌ ఎపిసోడ్‌ రెండు పార్ట్ లుగా ప్రసారం కానుంది. మొదటి పార్ట్ ఫిబ్రవరి 3న ప్రసారం చేయబోతున్నట్టు తెలిపారు. ఇది `ఆహా`లో స్ట్రీమింగ్‌ కానుంది. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు సుజీత్ డైరెక్షన్ లోనూ ఓ చిత్రంలో నటించబోతున్నారు. మరోవైపు పొలిటికల్ షెడ్యూల్ లోనూ పాల్గొంటూ బిజీగా ఉంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios