నాని హీరోగా నటిస్తున్న `అంటే సుందరానికి` చిత్రం కోసం పవన్‌ కళ్యాణ్‌ వస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా పవన్‌ రాబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

నానిని సర్‌ప్రైజ్‌ చేయబోతున్నారు పవన్‌ కళ్యాణ్‌. ఆయన నటించిన `అంటే సుందరానికి` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి పవర్‌ స్టార్‌ గెస్ట్ గా రాబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని నాని ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. సుందర్‌ ప్రసాద్‌ కోసం పవన్‌ కళ్యాణ్‌ వస్తున్నారు. అంటే సుందరానికి టీమ్‌ చాలా థ్రిల్‌గా ఉంది. థ్యాంక్యూ పవన్‌ కళ్యాణ్‌ సర్‌. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం ఎదురుచూస్తున్నాం` అని పేర్కొన్నారు హీరో నాని.

అంతకు ముందు చిత్ర యూనిట్‌ సెలబ్రేషన్‌ చాలా పెద్దగా, పవర్‌ ప్యాక్డ్ గా ఉండబోతుందని తెలిపింది. ఎగ్జైటింగ్‌ అప్‌డేట్‌ కోసం వెయిట్‌ చేయమని తెలిపింది. దీంతో పవన్‌ కళ్యాణ్‌ గెస్ట్ గా రాబోతున్నారని అంతా భావించారు. ఊహించినట్టే నాని పవన్‌ కళ్యాణ్‌ గెస్ట్ గా వస్తున్నట్టు ప్రకటించారు. శిల్పాకళా వేదికలో గురువారం(జూన్‌ 9న) ఈ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు. అయితే ముందుగా బుధవారం(జూన్‌8)ని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ప్లాన్‌ చేశారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ గెస్ట్ గా వస్తున్న నేపథ్యంలో డేట్‌ మారింది. 

Scroll to load tweet…

నాని హీరోగా నటిస్తున్న `అంటే సుందరానికి` చిత్రంలో నజ్రీయా నజీమ్‌ కథానాయికగా నటించింది. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కాబోతుంది. లవ్‌, ఇంటర్‌ కాస్ట్ మ్యారేజ్‌, వాటిలో ఉండే ఇబ్బందులు, ఆ ఇబ్బందుల్లో పుట్టే కామెడీ ప్రధానంగా మంచి ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఆని సుందర్‌ ప్రసాద్‌ అనే పాత్రలో నటించబోతున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ గెస్ట్ గా వస్తుండటంతో `అంటే సుందరానికి` చిత్రంపై బజ్‌ ఒక్కసారిగా పెరిగింది. అందరి దృష్టి ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌పై పడింది. పవన్‌ కళ్యాణ్‌ రాజకీయంగా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొంటున్నారంటే రాజకీయంగా ఏవైనా కామెంట్లు చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆ మధ్య ఏపీలో టికెట్ల సమస్యలో స్పందించిన వారిలో పవన్‌ కళ్యాణ్‌తోపాటు నాని కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరు ఇప్పుడు ఒకే స్టేజ్‌ని పంచుకోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.