పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రాల షూటింగ్ ఎప్పుడు షురూ చేస్తారో తెలియడం లేదు. భీమ్లా నాయక్ విడుదల తర్వాత ఆయన పూర్తి స్థాయిలో సినిమాపై ఫోకస్ పెట్టలేదు. రాజకీయంగా బిజీ అయిన పవన్ హరి హర వీరమల్లు, వినోదయ సిత్తం షూటింగ్ షురూ చేసి ఆపేశారు.  


హీరో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో సినిమాలను పక్కన పెట్టేశాడు. పవన్ కమ్ బ్యాక్ తర్వాత ప్రకటించిన చిత్రాల్లో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ మాత్రమే విడుదలయ్యాయి. ఈ రెండు రీమేక్స్ కావడంతో పాటు పవన్ పాత్ర నిడివి తక్కువగా ఉండడంతో నెలల వ్యవధిలో త్వరగా పూర్తి చేసి విడుదల చేశారు. హరి హర వీరమల్లు వంటి స్ట్రెయిట్ చిత్రాల భవిష్యత్ మాత్రం సందిగ్ధంలో పడింది. అసలు లేదు కొసరు అన్నట్లు హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి కాకుండానే వినోదయ సిత్తం రీమేక్ సైలెంట్ గా స్టార్ట్ చేశాడు. 

ఇక అక్టోబర్ నుండి ఏపీలో బస్సు యాత్ర ప్రారంభించనున్న పవన్ సినిమా షూటింగ్స్ కి పూర్తిగా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల వరుస రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ అనారోగ్యం బారిన పడ్డారు. ఓ వారం రోజులు రెస్ట్ తీసుకున్న పవన్ కొత్త ఫార్మ్ హౌస్ నిర్మాణం పనులు దగ్గరుండి చూసుకుంటున్నారని సమాచారం. ఆయన ప్రతి రోజు గండిపేట్ లో గల తన 16 ఎకరాల ఫార్మ్ హౌస్ కి వెళుతున్నారట. ఆ ల్యాండ్ లో గతంలో ఉన్న హౌస్ పడగొట్టి అన్ని హంగులతో విలాసవంతంగా పెద్ద భవన నిర్మాణం చేపట్టారట. ఆ ఫార్మ్ హౌస్ నిర్మాణం పనులు పర్యవేక్షిస్తూ అక్కడే గడుపుతున్నారట. 

సినిమాల పరంగా సైలెంట్ అయిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా మాత్రం క్రియాశీలకంగానే ఉంటున్నారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల దాడి చేస్తున్నారు. అయితే షూటింగ్స్ లో మాత్రం పాల్గొనడం ఆయనకు ససేమిరా ఇష్టం లేనట్లుంది. ముఖ్యంగా హరి హర వీరమల్లు ఆయనకు తలనొప్పిగా మారింది. ఆ మూవీ పూర్తి చేసే సమయం లేదు, చేయకపోతే నిర్మాతలు ఊరుకోరు. అయిష్టంగానే హరి హర వీరమల్లు(Hari hara veeramallu) పూర్తి చేస్తానని పవన్ ఒప్పుకున్నారు. ఇటీవల నిర్మాతలు షూటింగ్స్ కి బంద్ ప్రకటించడంతో ఆగస్టులో మొదలు కావాల్సిన హరి హర వీరమల్లు షూటింగ్ స్టార్ట్ కాలేదు. చాలా కాలంగా పవన్ చిత్రాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు.