Asianet News TeluguAsianet News Telugu

నేషనల్‌ లెవల్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న పవన్‌ హ్యాష్ ట్యాగ్

పవన్‌ బర్త్‌ డే స్పెషల్ హ్యాష్‌ ట్యాగ్‌కు కోటీ 20 లక్షలకు పైగా ట్వీట్స్‌ వచ్చాయి. ప్రస్తుతం ఈ  హ్యాష్ ట్యాగట్ నేషనల్‌ లెవల్‌లో నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుండటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. గత హీరోల రికార్డ్‌లను బద్ధలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది

Pawan Kalyan Birthday Hashtag Trending Top on National Level
Author
Hyderabad, First Published Sep 2, 2020, 7:35 AM IST

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ బర్త్‌ డే సందర్భంగా సందడి మామూలుగా లేదు. కొద్ది రోజుల క్రిందటే పవన్‌ హ్యాష్‌ ట్యాగ్‌తో వరల్డ్ రికార్డ్ సృష్టించిన అభిమానులు తాజాగా బర్త్‌ డే రోజు తమ రికార్డ్‌ను తామే బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మంగళవారం సాయంత్రం నుంచే #HBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. కేవలం 8 నిమిషాల్లోనే ఈ ట్యాగ్‌పై 2 మిలియన్ల పోస్ట్‌లు వచ్చాయంటే పవన్‌ మేనియా ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

బుధవారం కూడా అదే జోరు కనిపిస్తోంది. ఇప్పటికే పవన్‌ బర్త్‌ డే స్పెషల్ హ్యాష్‌ ట్యాగ్‌కు కోటీ 20 లక్షలకు పైగా ట్వీట్స్‌ వచ్చాయి. ప్రస్తుతం ఈ  హ్యాష్ ట్యాగట్ నేషనల్‌ లెవల్‌లో నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుండటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. గత హీరోల రికార్డ్‌లను బద్ధలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఈ రోజు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ కూడా ఉండటంతో అభిమానులు మరింతగా హడావిడి చేస్తున్నారు.

పవన్‌ నటిస్తున్న వకీల్‌సాబ్‌ ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌తో పాటు ఆ తరువాత చేయబోయే మరో రెండు సినిమాలకు సంబంధించి అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ ఈ రోజే ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పని అభిమానుల సందడి సోషల్ మీడియాలో ఈరోజంతా కనిపిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇదే జోరు కొనసాగితే అన్‌ బీటబుల్‌ రికార్డ్‌ సెట్ చేయటం గ్యారెంటీ అంటున్నారు పవర్‌ స్టార్ ఫ్యాన్స్.

Follow Us:
Download App:
  • android
  • ios