టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు వచ్చినా త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ని బీట్ చేయలేవనే చెప్పాలి. జల్సా - అత్తారింటికి దారేది సినిమాలతో ఎవరు ఉహించనై విధంగా సక్సెస్ లు అందుకున్న ఈ కాంబినేషన్ మూడవసారి ఫెయిల్ అయినప్పటికీ ఓపెనింగ్స్ ఏ విధంగా వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఇప్పటికి కూడా టాప్ ఓపెనింగ్స్ లిస్ట్ తిస్తె అజ్ఞాతవాసి దర్శనమిస్తుంది.  ఆ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యేదో ఊహలకు అందడం లేదు. ఇకపోతే మరోసారి ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఇటీవల ఒక టాక్ వైరల్ అవుతోంది. దిల్ రాజు వీరిద్దరిని కలిపేందుకు బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  అయితే ఆ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారనేది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ తప్పకుండా డైలాగ్స్ అందిస్తారని టాక్ వస్తోంది.  గతంలో పవన్ తీన్ మార్ సినిమాకు మాటల మాంత్రికుడు డైలాగ్స్ రాసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరోసారి అదే తరహాలో పవన్ సినిమాలో భాగం కానున్నట్లు సమాచారం. త్వరలోనే పవన్ సినిమాపై ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ రానుంది. ఈ ఏడాదిలో ఎదో ఒక సినిమాను స్టార్ట్ చేసి ఆర్థికంగా కూడా పవన్ కొంత నిలదొక్కుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ రీ ఎంట్రీ అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.