పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ వచ్చింది. ఆయన హీరోగా నటిస్తున్న `బ్రో` చిత్రం టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేస్తున్నట్టు మూడు రోజుల క్రితమే టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ వచ్చింది. ఆయన హీరోగా నటిస్తున్న `బ్రో` చిత్రం టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేస్తున్నట్టు మూడు రోజుల క్రితమే టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పవన్ ఫ్యాన్స్ లో సంబరాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. వాటిని పీక్‌లోకి తీసుకెళ్లేందుకు, ఫ్యాన్స్ ని మరింత ఖుషీ చేసుందుకు ఇప్ఉపడు టీజర్‌తో వచ్చారు. `బ్రో` సినిమా టీజర్ తాజాగా గురువారం సాయంత్రం రిలీజ్ చేశారు.
ఏంటి చీకటిగా ఉంది.. పవర్ లేదా అని సాయిధరమ్ తేజ్ డైలాగులతో టీజర్ మొదలవుతుంది. పవర్ లేదా అని తేజు అన్నప్పుడు మెరుపు వస్తుంది. చీకట్లని చీల్చినట్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. హలొ గురువు గారు, తమ్ముడు, బ్రో అంటూ సాయిధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ ని పిలవడం టీజర్ లో చాలా బాగా అనిపిస్తోంది.
టీజర్ మొత్తం తేజు, పవన్ మధ్య సంభాషణలతోనే నింపేశారు. దేవుడి పాత్రలో నటిస్తున్న పవన్ మోడ్రన్ లుక్స్ లో అదరగొడుతున్నారు. కాలం.. మీ గడియారానికి అందని ఇంద్రజాలం అని పవన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇంకా టీజర్ లో పవన్.. తేజుతో కలసి చేసిన అల్లరి చాలానే ఉంది. టీజర్ కోసం తమన్ అందించిన బిజియం అయితే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. కొన్ని షాట్స్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ హీరోగా, మెగా మేనల్లుడు కీలక పాత్రలో నటిస్తున్న చిత్రమిది. తమిళ దర్శకుడు, ప్రముఖ నటుడు సముద్రఖని దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళంలో రూపొంది హిట్ అయిన `వినోదయ సీతం` చిత్రానికి రీమేక్. తెలుగుకి తగ్గట్టుగా సముద్రఖని మార్పులు చేశారు. తాజాగా టీజర్ చూస్తుంటే సరికొత్తగా అనిపిస్తుంది. పవన్ ఫ్యాన్స్ ఇప్పటి వరకు ఈ చిత్రంపై అంతగా హోప్స్ పెట్టుకోలేదు. కానీ టీజర్ చూశాక ప్రతి ఒక్కరిలో అంచనాలు పెరిగిపోవడం ఖాయం. 
సినిమా టీజర్ కోసం బుధవారం మంగళగిరిలో తన వారాహి రథ యాత్ర వద్ద డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆ సమయంలోనే పవన్ ఈ టీజర్‌ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. టీమ్‌తో కలిసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు విడుదలైన టీజర్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తుంది. ఇక నేటి నుంచి `బ్రో` మానియా స్టార్ట్ అయినట్టే అనే సిగ్నల్స్ ని ఇచ్చేలా ఈ టీజర్ ఉండటం విశేషం. ఇక ఈ సినిమాని జులై 28న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
