‘మా బంగారు గని సముద్రఖని’ అంటూ పవన్ స్పెషల్ నోట్.. బ్రిలియంట్ డైరెక్టర్ అంటూ తేజూ ట్వీట్..
ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని (Samuthirakani) పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ నోట్ విడుదల చేశారు.
నటుడిగా సముద్రఖని తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. త్వరలో దర్శకుడిగానూ ఆడియెన్స్ ను అలరించబోతున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి ‘వినోదయ సీతమ్’ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈరోజు సముద్రఖని పుట్టిన రోజు కావడం విశేషం. 1973 ఏప్రిల్ 26న ఆయన చెన్నైలోని, రాజపాలయం, సీతూర్ లో జన్మించారు. నేటితో 49వ ఏట అడుగుపెట్టారు. తమిళ ఇండస్ట్రీలో 1998 నుంచి యాక్టివ్ గా ఉంటున్నారు. ఫిల్మ్ డైరెక్టర్ గా, నటుడిగా, స్క్రీన్ రైటర్ గా, వాయిస్ యాక్టర్ గా సముద్రఖని తనదైన ముద్ర వేసుకున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ నటించి మంచి గుర్తింపు సాధించారు. ‘రఘువరన్ బీటెక్’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇందులో ఆయన నటనకు నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది.
నటుడికి టాలెంట్ అవసరం అని, ఫిజికల్ అపియరెన్స్ తో పనిలేదని నిరూపించిన సముద్రఖని త్వరలో PKSDT ద్వారా తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగానూ పరిచయం కాబోతున్నారు. ఈఱోజు ఆయన పుట్టిన రోజుకావడంతో పవన్ కళ్యాణ్ స్పెషల్ నోట్ విడుదల చేశారు. ‘ప్రతిభావంతుడైన దర్శకుడు, రచయిత, నటుడు, మా బంగారు గని శ్రీ సముద్రఖనికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మానవ సంబంధాలపై విశ్వాసం కలిగిన వారు, కుల రహిత సమాజాన్ని కోరుకునే వ్యక్తి, నటుడిగా జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నారు.
నేను నటించిన ‘భీమ్లా నాయక్’లో ఆయన ముఖ్య భూమిక పోపించారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. శ్రీ మూకాంబికా అమ్మవారి భక్తుడైన సముద్రఖనికి ఆ జగజ్జనని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాను.’ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే సాయి ధరమ్ తేజ్ (Sai Dharam) కూడా ‘బ్రిలియంట్ డైరెక్టర్ సమ్రదఖనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు మరింత ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అందరీ ప్రేమను పొందేలా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
సముద్ర ఖని ‘అలా వైకుంఠపురం’తో తెలుగు అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘క్రాక్’, ‘ఆకావవాణి’, ‘భీమ్లా నాయక్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘సర్కారు వారి పాట’, ‘సార్’, ‘దసరా’లో నటించారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు ఎస్ శంకర్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’లో నటిస్తున్నాడు.