పవన్‌ కళ్యాణ్‌, రానా చిత్రానికి టైటిల్ ఫిక్స్, అదేంటంటే

పవన్ కు సంబంధించిన ఓ పోస్టర్ ను పోస్ట్ చేస్తూ ఆగష్టు 15న ఉదయం 9.45 గంటలకు సినిమా టైటిల్ తో పాటు, ఫస్ట్ గ్లింప్సె ఉంటుందని వెల్లడించారు.  ఇది నిజంగా మెగా ఫ్యాన్స్ ఎగిరి గంతేసే అప్డేట్ అని చెప్పాలి.  ఈ నేపధ్యంలో టైటిల్ ఏమై ఉంటుందనే చర్చ మొదలైంది.

Pawan Kalyan and Rana Daggubati title fixed

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ మలయాళ యాక్షన్ డ్రామా “అయ్యప్పనుమ్ కోషియుమ్” అఫీషియల్ రీమేక్‌  ఇది.  ఈ రీమేక్ కు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.   ఈ ప్రాజెక్ట్ కు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.  తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఆగష్టు 15న పవర్ స్టార్మ్ రాబోతోందని, సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఆగస్టు 15న ఉదయం 9:45గంటలకు ఈ చిత్ర టైటిల్‌, పవన్‌ కల్యాణ్‌ పాత్రకి సంబంధించి గ్లింప్స్‌ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ని విడుదల చేశారు దర్శక-నిర్మాతలు. 

ఈ పోస్టర్ లో పవన్‌ కల్యాణ్‌ లుంగీ కట్టులో వెనక్కి తిరిగి కనిపించారు. ప్రీ లుక్‌తోనే ఆసక్తిని పెంచేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం టైటిల్ ఏంటనేది చర్చగా మారింది. అందుతున్న సమచారం మేరకు ఈ సినిమాకు భీమ్లానాయక్‌ అనే టైటిల్ నే ఫిక్స్ చేసినట్లు సమాచారం. పవన్‌ కల్యాణ్‌... భీమ్లానాయక్‌గా కనిపించనున్నారు.  అయితే ఈ సినిమా ఒరిజినల్ మళయాళ వెర్షన్‌లో మాత్రం ఇద్దరు హీరోల పేరు మీద టైటిల్ ఉంటుంది. దాంతో ఈ తెలుగు రీమేక్‌లో ఒక్క హీరో పేరునే పెడుతారా.. లేక బయిట ప్రచారం జరుగుతున్నట్లు పరుశురామ కృష్ణమూర్తి ను టైటిల్‌గా పెడుతారా... అని తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ వందకు తొంబై శాతం భీమ్లా నాయక్ టైటిల్‌ను ఖరారు చేసే అవకాశం మెండుగా ఉంది.

 ఇక ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్  సరసన నిత్య మేనన్‌ నటిస్తుండగా రానా సరసన ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. మరో ప్రక్క సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి సినిమాలో నుంచి మొదటి పాటను సెప్టెంబర్ 2 న విడుదల చేయబోతున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios