తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. వందల కోట్ల బడ్జెట్ లో నిర్మాతలు ధైర్యంగా సినిమాలు చేస్తున్నారు. దర్శకులు కూడా అలాంటి కథలతో వస్తున్నారు. ఇలాంటి తరుణంలో టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్ కి సంబంధించిన వార్తలు ఆసక్తికరంగా మారాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లకు లోకల్ గా తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ మార్కెట్ ఉంది. 

ప్రస్తుతం ఉన్న డిమాండ్ ప్రకారం వీరిద్దరే పారితోషికం పరంగా అగ్రస్థానంలో ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కమిటైనా ఆయన అంగీకరిస్తే 55 కోట్ల పారితోషికం ఇచ్చి సినిమా చేసేందుకు హారికా అండ్ హాసిని, మైత్రి మూవీ మేకర్స్ లాంటి బడా ప్రొడక్షన్ హౌసెస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మైత్రి నిర్మాతలు పవన్ తో సినిమా చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు 50 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఆలిండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ సాహో చిత్రం 40 కోట్ల రెమ్యునరేషన్, మరికొంత లాభాల్లో వాటా పొందుతున్నట్లు సమాచారం. 

ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ లాంటి హీరోలు సినిమాకు 20 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారు.