ప్రతీ నియోజక వర్గానికి పాతిక కోట్లు పెట్టేశాం. అన్నీ సర్దేశాం అని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రకాశం పంతులు, ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది. వీళ్లకు ఈ అవినీతి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. యువత అంటే మీ ఇంట్లో వుండే వాళ్లే అనుకుంటున్నారా. వాళ్లు దోచుకున్నా ఫర్వాలేదా... మనీ లాండరింగ్ కేసులో.. నోట్ల మార్పిడి సందర్భంగా పట్టుబడ్డ శేఖర్ రెడ్డి కేసులో లోకేష్ హస్తం వుంది. దానికి సంబంధించిన సమాచారం ప్రధాని మోదీ వద్ద వుందని పవన్ అన్నారు.

 

సీఎం గారూ... మీ అబ్బాయి నేరుగా చేస్తున్న అవినీతి మీకు తెలుసా లేదా.. తెలిసే చేయిస్తున్నారా లేదా.. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నాకు వ్యక్తిగతంగా మీ మీద చాలా గౌరవం వుంది. కానీ మీ అనుభవం... ఆంధ్ర ప్రదేశ్ లో అవినీతి లో నంబర్ వన్ స్థానంలో వుంది. ఇదేనా మనం సాధించింది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పాను. సీఎంకు పట్టులేదా.. లేక తెలిసే చేస్తున్నారా.  అయితే 2019లో సరికొత్త నాయకున్ని ఎన్నికుని తీరుతారు. 2014 ఎన్నికలంత సుఖంగా 2019 ఎన్నికలు వుండవు. అమరావతి రైతుల భూములు తీసుకున్నారు. వాళ్లకిచ్చిన పట్టాలు చెల్లుతాయా లేదా అనే భయంతో రైతులు బతుకుతున్నారు. మీ అవినీతి అంటే అంత భయపడుతున్నారు.

 

మీ బుధ్ది మారలేదు. మా ఆలోచన మారలేదు. తెదెపా నుంచి ఇక నేనేమీ ఆశించట్లేదు. ఆశలు ఆవిరైనయి. గాలి జనార్థన్ రెడ్డి గురించి ఎన్ని మాట్లాడారు. ఆయన తప్పయితే... ఇసుక మాఫియాలో మీరు చేస్తున్నది తప్పు కాదా.. ఎర్ర చందనం స్మగ్లర్లు కొట్టుకెళ్తుంటే... ఏం చేస్తున్నారు. ఎందుకు యంత్రాంగాన్ని పటిషష్టం చేయట్లేదు. కడియం నర్సరీ రైతులు నా దగ్గరికి వచ్చి చెప్పారు... 5 ఇంచులు తవ్వితే కేసులట మరి వీళ్లపైనే మైనింగ్ కేసులు పెడితే.. నెల్లూరు అవతల, తూగోలో మొత్తం తవ్వేస్తుంటే ఏం చేస్తున్నారు. ఇది మీ బాధ్యత కాదా.. సగటున తెదెపా ఎమ్మెల్యే ఎంత సంపాదించారు. యాక్సిడెంట్ అయిన మనిషిని దోచుకుంటారా.. విభజన తర్వాత కన్న తల్లిలా చూసుకోవాలి. కన్న తల్లిని రక్షించుకోరా.. కానీ ఏం చేస్తున్నారు. దోచుకుంటున్నారు. మూల్యం చెల్లిస్తారు. అని పవన్ అన్నారు.