రికార్డులు బద్దలు కొడుతున్న అజ్ఞాతవాసి

First Published 17, Dec 2017, 8:03 PM IST
PAWAN KALYAN AGNATHAVAASI CREATING RECORDS
Highlights
  • పవన్ కళ్యాణ్ హీరోోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న అజ్ఞాతవాసి
  • అజ్ఞాతవాసిలో పవన్ సరసన హిరోయిన్లుగా కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్
  • రికార్డులు బద్దలు కొడుతున్న తాజాగా రిలీజైన అజ్ఞాతవాసి ట్రైలర్ వ్యూస్

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న 'అజ్ఞాతవాసి' టీజర్ శనివారం సాయంత్రం విడుదలవ్వగా ఆదివారం సాయంత్రం వరకు 24 గంటల్లోనే ఆరుమిలియన్ పైగా యూట్యూబ్ వ్యూస్ సాధించి రికార్డు స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది. యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఈ టీజర్ నెం.1 స్థానంలో ఉన్న అజ్ఞాతవాసిపై... టీజర్ విడుదల తర్వాత అంచనాలు మరింత పెరిగాయి.

 

‘అజ్ఞాతవాసి' టీజర్ మీద పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.... ‘స్వాగతం కృష్ణా రికార్డులన్నీ నీ చరణాగతం కృష్ణా..' అంటూ ప్రశంసలు కురిపించాడు. ఆయన అన్నట్లే రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటూ ‘అజ్ఞాతవాసి' టీజర్ దూసుకెళుతోంది.

 

ప్రముఖ తెలుగు కమెడియన్ వెన్నెల కిషోర్ స్పందిస్తూ... బ్యూటీ అంటే అదీ, టీజర్ అదిరిపోయింది అంటూ ట్వీట్ చేశారు. ప్రముఖ నటుడు శ్రీకాంత్ స్పందిస్తూ... టీజర్ చాలా బావుంది, పవన్ కళ్యాణ్‌తో పాటు ఎంటైర్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు. పవన్ వీరాభిమాని నితిన్ నితిన్‌ స్పందిస్తూ... ‘వావ్‌.. అద్భుతం.. కిక్‌ ఇచ్చింది.. పవర్‌స్టార్‌ రచ్చ చేశారు. త్రివిక్రమ్‌ సర్‌ చక్కగా తీశారు. ‘అజ్ఞాతవాసి' టీజర్‌ షేక్‌ చేసింది. జనవరి 10వ తేదీ త్వరగా రా..' అంటూ కామెంట్ చేశాడు.

మంచు మనోజ్ స్పందిస్తూ మంచు మనోజ్ స్పందిస్తూ... ‘అజ్ఞాతవాసి' టీజర్‌ అద్భుతంగా ఉంది. నా సోదరుడు పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, మొత్తం యూనిట్‌ సభ్యులకు ఈ సినిమా సూపర్‌ బ్లాక్‌బస్టర్‌ కావాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశారు.

పరుచూరి గోపాలకృష్ణ... స్పందిస్తూ ‘‘అజ్ఞాతవాసి' సమస్త ప్రేక్షక హృదయవాసి అయ్యేలా ఉంది! టీజర్‌ చూస్తేనే సినిమా చూసినంత తృప్తి కలిగింది. పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ రాధాకృష్ణ, మొత్తం చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌' అని వ్యాఖ్యానించారు.

 

యంగ్ హీరో నిఖిల్ స్పందిస్తూ....‘ఏందీ షాటు.. ‘అజ్ఞాతవాసి' టీజర్‌లో నాకు ఎంతో నచ్చింది. కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌. 2018 జనవరి 10వ తేదీని గుర్తు పెట్టుకోండి' అంటూ పవన్‌ ఎంట్రీ స్టిల్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

 

తెలుగు సినీ రచయిత, దర్శకుడు బీవీఎస్‌ రవి స్పందిస్తూ.... ‘వీరి చర్యలు వూహాతీతం' అంటూ కామెంట్ చేశారు. మాటల్లేవ్... గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె స్పందిస్తూ.... ‘టీజర్ చూసిన తర్వాత మాటలు రావడం లేవు.. 01-10-2018 కోసం ఎదురుచూస్తున్నాం అంతే..' అంటూ ట్వీట్ చేశారు.

 

దర్శకుడు మొహర్ రమేష్ స్పందిస్తూ... అజ్ఞాతవాసి టీజర్ అద్భుతంగా ఉందని, సంక్రాంతికి దిపావళి మాదిరిగా టపాసులు పేలడం ఖాయం అంటూ ట్వీట్ చేశారు.

 

‘అజ్ఞాతవాసి' టీజర్ టాలీవుడ్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక యూట్యూబ్‌లోనే ఆదివారం సాయంత్రం వరకు 6,216,572 మంది చూశారు. ఇతర మాధ్యమాల్లో కలిపి టీజర్ వ్యూస్ కోటి దాటిందని అంచనా వేస్తున్నారు.

loader