జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శిల్పకళా వేదికలో జరిగింది. మెగాస్టార్ అభిమానిగా మీలో ఒకడిగా తాను ఈ కార్యక్రమానికి వచ్చానని పవన్ అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొన్నారు. 

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నా జీవితంలో స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తులు ఇద్దరే. ఒకరు మెగాస్టార్ చిరంజీవి.. ఇంకొకరు అమితాబ్ బచ్చన్. చిరంజీవి గారు తాను తప్పుదోవ పట్టకుండా మూడు సందర్భాల్లో స్ఫూర్తిగా నిలిచారు. సైరా చిత్రం గురించి మాట్లాడుతూ.. తమ ఇంటి పేరుతో కొణిదెల అనే గ్రామం ఉందని పవన్ తెలిపారు. 

అన్నయ్య చిరంజీవి గారు సైరా లాంటి ఉద్యమ వీరుడి కథలో నటించాలని చాలా రోజులుగా కోరుకున్నా. సైరా చిత్రాన్ని నిర్మించాలనే ఉండేది. కానీ నాదగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేవు. కానీ న  రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందని పవన్ అన్నారు. ఉయ్యాలవాడ కథని తెరక్కించాలని తెలుగు సినిమా మద్రాసులో ఉన్న సమయం నుంచి వింటున్నా. కానీ ఎవ్వరికి ధైర్యం చాల్లేదు. ఒక్క రాంచరణ్ మాత్రమే నిర్మించాడు అని పవన్ తెలిపారు. 

ఉయ్యాలవాడ కథలో కేవలం చిరంజీవి గారు మాత్రమే నటించాలని రాసిపెట్టిందని పవన్ అన్నారు. ఈ చిత్రానికి తాను వాయిస్ ఓవర్ అందించడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాని పవన్ తెలిపారు.