టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా దూసుకుపోయిన పవన్ కళ్యాణ్ కి ఎంతటి ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా భారీ వసూళ్లను సాధిస్తుంటాయి. 'అజ్ఞాతవాసి' సినిమా తరువాత పవన్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు.

వచ్చే ఏడాది రాబోయే ఏపీ ఎలెక్షన్స్ లో పోటీ చేయబోతున్నాడు. ఈ క్రమంలో ఆయన మళ్లీ సినిమాలు చేయరని అన్నారు. కానీ కొందరు నిర్మాతలు మాత్రం పవన్ కి అడ్వాన్స్ ఇచ్చామని ఆయనతో సినిమా చేసి తీరతామని అన్నారు. రీసెంట్ గా పవన్ ఓ పొలిటికల్ ఫిల్మ్ లో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి.

రామ్ తాళ్ళూరి నిర్మాణంలో డాలీ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని అన్నారు. కానీ ఆ వార్తలను సీరియస్ గా ఖండించాడు  పవన్. నా దృష్టి మొత్తం రాజకీయాలపైనే ఉందని, ప్రజలకు సేవ చేయడానికే వచ్చానని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజాపోరాట యాత్ర పేరుతో పర్యటిస్తున్నాడు. అక్కడ విలేకర్లు అడిగిన ప్రశ్నలకు పవన్ ఆసక్తికర జవాబులు చెప్పాడు.

సినిమాల ప్రస్తావన రాగానే.. తన దగ్గరకి కొంతమంది నిర్మతాలు వచ్చి, సినిమాలు చేయమని అడుగుతున్నారని అన్నాడు. అలానే ''రాజకీయాలకు నిధులు అవసరం కాబట్టి వాటికోసమైన సినిమాలు చేయమని నా సన్నిహితులు సలహా ఇస్తున్నారు. గతంలో ఎంజీఆర్ వంటి నటులు అలానే చేసేవారని చెప్పారు. ఈ విషయంపై నేను కూడా ఆలోచిస్తున్నాను'' అంటూ పవన్ చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది.

డబ్బు కోసం సినిమాలు చేస్తాడా..? లేక నిర్మాతలకు కమిట్మెంట్ ఇవ్వడం వలన సినిమాలు చేస్తాడా..? అనే విషయాన్ని పక్కన పెడితే ఆయన సినిమాలు చేయడం ఖాయమనిపిస్తుంది. అలాంటప్పుడు 'ఇక సినిమాలు చేయను.. నా జీవితం ప్రజా సేవకే అంకితం' వంటి స్టేట్మెంట్ లు ముందే పాస్ చేయడం ఎందుకనేది కొందరి ప్రశ్న. రేపు మళ్లీ సినిమాలు చేయనని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే పవన్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు!

పవన్ ఈగోని హర్ట్ చేశారట!

తన పొలిటికల్ ఫిల్మ్ పై పవన్ క్లారిటీ!

పొలిటికల్ చిత్రంలో పవన్, డైరక్టర్ ఎవరంటే..?

బ్రేకింగ్ అప్డేట్: పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పవన్ పవర్ఫుల్ మూవీ?