సోషల్ మీడియా రికార్డ్స్  పూర్తిగా ఫ్యాన్స్ అదుపులో  ఉంటాయి. ఒక హీరో కోసం ఫ్యాన్స్ ఎంత కష్టపడితే అంత పెద్ద రికార్డు నమోదు చేయవచ్చు. కొన్నాళ్లుగా ఇది చిత్ర పరిశ్రమలో ట్రెండ్ గా మారగా తమ అభిమాన హీరో బర్త్ డే, బర్త్ డే సీడీపీ, మూవీ ఫస్ట్ లుక్, ట్రైలర్, టీజర్స్ తో పాటు గతంలో భారీ విజయాలు సాధించిన చిత్రాల యానివర్సరీలు  ట్రెండ్ చేస్తున్నారు. కాగా నిన్న సాయంత్రం నుండి పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ ని షేక్ చేస్తున్నారు. పవన్ బర్త్ డే సీడీపీ యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తూ...కొత్త రికార్డు కోసం చమటోడుస్తున్నారు.

ఇప్పటికే పవన్ బర్త్ డే సీడీపీ 52 మిలియన్ ట్వీట్స్ కి చేరినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లక్ష్యం 63 మిలియన్ ట్వీట్స్. ఆగస్టు 9న మహేష్ ఫ్యాన్స్ ఆయన బర్త్ డే యాష్ ట్యాగ్ ని భారీగా ట్రెండ్ చేయడంతో పాటు 60.2 మిలియన్ ట్వీట్స్ తో వరల్డ్ రికార్డు నెలకొల్పారు. దీనితో మహేష్ ఫ్యాన్స్ నమోదు చేసిన ఆ రికార్డు బ్రేక్ చేయడమే లక్ష్యంగా పవన్ ఫ్యాన్స్ ముందుకు వెళుతున్నారు. ఆ విధంగా చూసుకుంటే మరో రెండు గంటల సమయం ఉండగా దాదాపు 11 మిలియన్స్ ట్వీట్స్ చేయాల్సి వుంది. మరి ఆ మార్కుకు దగ్గరగా వచ్చిన పవన్ ఫ్యాన్స్ బ్రేక్ చేస్తారో లేదో చూడాలి. 

ఒక వేళ పవన్ బర్త్ డే సీడీపీ తో మహేష్ రికార్డు ని బ్రేక్ చేయలేకపోయినా, సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు ఉంది, ఆ రోజు మాత్రం పవన్ ఫ్యాన్స్ మహేష్ వరల్డ్ రికార్డు ని బ్రేక్ చేయడం ఖాయం అంటున్నారు. కాగా పవన్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ నుండి ఆ రోజే టీజర్ కూడా విడుదల కానుంది. 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి కాగా, పవన్ పుట్టిన రోజు టీజర్ విడుదల కావడం ఖాయం అంటున్నారు. పవన్ ని వెండితెరపై చూసి దాదాపు మూడేళ్లు అవుతుండగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.