పవన్ ఫ్యాన్స్ తలుచుకుంటే  ఏ రికార్డు అయినా మటాషే. తమ హీరో కోసం వారు ఓ దండులా పనిచేస్తారు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు నేపథ్యంలో నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే సీడీపీ ట్యాగ్ ని ట్విట్టర్ లో భారీగా ట్రెండు చేస్తున్నారు. ట్రెండు స్టార్ట్ చేసిన 9 నిమిషాలలో ఈ యాష్ ట్యాగ్  వన్ మిలియన్ ట్వీట్స్ దక్కించుకోవడం విశేషం. కాగా ట్విట్టర్ ట్రెండింగ్ లో సరికొత్త రికార్డు నెలకొల్పాలనే ప్రయత్నంలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇక మహేష్ ఫ్యాన్స్ ఆగస్టు 9న వరల్డ్ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. మహేష్ ఫ్యాన్స్ ఏకంగా 60.2 మిలియన్ మహేష్ బర్త్ డే ట్వీట్స్ తో వరల్డ్ రికార్డు నెలకొల్పారు.

దీనితో  ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ టార్గెట్ మహేష్ ఫ్యాన్స్ రికార్డుని బ్రేక్ చేయడమే. పవన్ బర్త్ డే సీడీపీతోనే మహేష్ ఫ్యాన్స్ నెలకొల్పిన వరల్డ్ రికార్డు బ్రేక్ చేస్తామని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. దీనికోసం వరల్డ్ వైడ్ గా ఉన్న పవన్ ఫ్యాన్స్ కొన్ని టీమ్స్ గా పనిచేస్తున్నారు. కొత్త రికార్డు నెలకొల్పడం వీరు ఒక ప్రేస్టీజియస్ విషయంగా పెట్టుకున్నారు. రెండేళ్లు సినిమాలు చేయని కారణంగా పవన్ బాక్సాఫీస్ రికార్డ్స్  అన్ని కనుమరుగైపోయాయి. ఈ రెండేళ్లలో వచ్చిన అనేక చిత్రాలు పవన్ గత చిత్రాల రికార్డ్స్ చెరిపివేశాయి. దీనితో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా రికార్డ్స్ నెలకొల్పాలని చుస్తున్నారు.

 మరి పవన్ ఫ్యాన్స్ ముందు 60 మిలియన్స్ అనే అతిపెద్ద టార్గెట్ ఉంది. మరి దానిని బీట్ చేసి కొత్త రికార్డు నెలకొల్పుతారో లేదో చూడాలి. 9 నిమిషాలలో వన్ మిలియన్ ట్వీట్స్ కి చేరుకున్న పవన్ ఫ్యాన్స్ జోరు చూస్తుంటే మహేష్ రికార్డు బ్రేక్ చేసేలానే ఉన్నారు. మరి వీరి సత్తా ఏమిటో రేపు సాయంత్రం 6:00 గంటల వరకు తేలిపోనుంది. ఇక పవన్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ చిత్రీకరణ చివరి దశలో ఉండగా, సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే విడుదల కానుంది.