పవన్ ఫ్యాన్స్  తాము తలచుకుంటే ఎంత పెద్ద రికార్డు అయినా బ్రేక్ చేస్తాం అని నిరూపించారు. ఏకంగా 24 గంటలో 65.1 మిలియన్ ట్వీట్స్ తో వరల్డ్ రికార్డు నెలకొల్పారు. నిన్న సాయంత్రం 6:00 గంటల నుండి పవన్ బర్త్ డే సీడీపీ ట్రెండ్ చేయడం మొదలుపెట్టిన పవన్ ఫ్యాన్స్ నేటి సాయంత్రం 6:00 గంటల సమయానికి ఈ రికార్డు నమోదు చేశారు. వరల్డ్ వైడ్ గా ఉన్న పవన్ ఫ్యాన్స్ దీని కోసం బాగా కష్టపడ్డారని చెప్పాలి. దాదాపు 1.5 లక్షల ఆదర్స్ దీనికోసం పనిచేసినట్లు సమాచారం.

ఇక పవన్ ఫ్యాన్స్ గతంలో మహేష్ పేరిట  ఉన్న రికార్డు బ్రేక్ చేశారు. మహేష్ ఫాన్స్ ఈనెల 9న మహేష్ బర్త్ డే యాష్ ట్యాగ్ ని భారీగా ట్రెండ్ చేసి, 62.1 మిలియన్ ట్వీట్స్ తో వరల్డ్ రికార్డు సెట్ చేశారు. ఈ రికార్డుని పవన్ ఫాన్స్ ఆయన బర్త్ డే సీడీపీతో కొల్లగొట్టడం జరిగింది. మరి బర్త్ డే సీడీపీతోనే ఇంత పెద్ద రికార్డు సెట్ చేసిన వీరు, పవన్ బర్త్ డే నాడు  ఇంకెంత పెద్ద రికార్డు నెలకొల్పుతారో అని అందరూ ఆశ్చర్య పోతున్నారు.

సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు నేపథ్యంలో ఇప్పటి నుండే ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో భౌతికమైన వేడుకలు ఉండకపోవచ్చు. దీనితో మరలా ఫ్యాన్స్ సందడి సోషల్ మీడియా ద్వారానే. ఇక ఆ రోజు పవన్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ టీజర్ కూడా రానుంది . ఇప్పటికే చిత్ర యూనిట్ టీజర్ కట్ చేసే పనిలో ఉన్నారట. పవన్ ని వెండితెరపై చూసి ఏళ్ళు గడిచిపోతుండగా, వకీల్ సాబ్ టీజర్ ని కూడా వీరు భారీగా ట్రెండ్ చేయడం ఖాయం.