Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య సినిమాలో జగన్ రోల్.. వాటే ట్రిక్?

పరుచూరి మురళి గుర్తున్నారా...బాలకృష్ణతో అధినాయకుడు సినిమా డైరక్ట్ చేసిన దర్శకుడు. అంతకుముందు గోపీచంద్ తో ఆంధ్రుడు చిత్రం తీసి హిట్ కొట్టాడు. ఆయన ఇప్పుడు ఊహించని విధంగా సీన్ లోకి వచ్చారు. బాలకృష్ణ కొత్త చిత్రానికి కథ ఇస్తున్నట్లు సమాచారం. జూన్ 13న అఫీషియల్ గా లాంచ్ అవుతుందని ప్రచారం జరుగుతున్న ఈ చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకుడు. ముందు అనుకున్న డైరక్టర్ తో సినిమానే కానీ..ముందు అనుకున్న కథ మాత్రం కాదు. 
 

Paruchuri Murali Story for Balakrishna movie
Author
Hyderabad, First Published Jun 12, 2019, 7:33 AM IST

పరుచూరి మురళి గుర్తున్నారా...బాలకృష్ణతో అధినాయకుడు సినిమా డైరక్ట్ చేసిన దర్శకుడు. అంతకుముందు గోపీచంద్ తో ఆంధ్రుడు చిత్రం తీసి హిట్ కొట్టాడు. ఆయన ఇప్పుడు ఊహించని విధంగా సీన్ లోకి వచ్చారు. బాలకృష్ణ కొత్త చిత్రానికి కథ ఇస్తున్నట్లు సమాచారం. జూన్ 13న అఫీషియల్ గా లాంచ్ అవుతుందని ప్రచారం జరుగుతున్న ఈ చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకుడు. ముందు అనుకున్న డైరక్టర్ తో సినిమానే కానీ..ముందు అనుకున్న కథ మాత్రం కాదు. 

బాలయ్య కోసం కెఎస్ రవికుమార్ ఓ కథ ని రెడీ చేసి ఒప్పించుకున్నారు. కానీ ఆ కథలో విలన్ పాత్ర  ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పోలి ఉందిట. అది కనుక పట్టాలు ఎక్కితే లేనిపోని సమస్యలు వస్తాయని భావించిన దర్శక,నిర్మాతలు స్క్రిప్టు మార్చారు. అయితే మార్చిన స్క్రిప్టు బాలయ్యకు నచ్చలేదు. దాంతో ప్రాజెక్టు ఆగిపోయే పరిస్దితి ఏర్పడింది.

ఈలోగా బాలయ్యకు ఓ కథ వినిపించి ఉన్నారు పరుచూరి మురళి. ఆ కథ బాగా నచ్చేసింది ఆయనకు. ఈ సినిమా తర్వాత దాన్ని పట్టాలు ఎక్కిద్దామనుకున్నారు. అయితే ఈ లోగా తన ప్రస్తుత చిత్రం కథ లేక ఆగిపోవటం నచ్చలేదు ఆయనకు. దానికి తోడు బయిట ...జగన్ కు వ్యతిరేకంగా రాసుకున్న కథతో చేసే సినిమా ఆగిపోయిందనే ప్రచారం ఊపందుకుంది. ఇది గమనించిన బాలయ్య వెంటనే నష్ట నివారణ కార్యక్రమాలు మొదలెట్టారు. పరుచూరి మురళిని ఒప్పించి ఆ కథతో కెఎస్ రవి కుమార్ తో సినిమా చేస్తున్నారు. 

సి కళ్యాణ్ నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టుకు ‘క్రాంతి’ టైటిల్‌ను ఎంపిక చేసుకున్నారు. టైటిల్ విషయంలో బాలకృష్ణ సైతం సంతృప్తి వ్యక్తం చేయడంతో -క్రాంతి ఖరారు అయ్యే అవకాశాలే ఎక్కువున్నాయి. బాలయ్యకు పోలీస్ పాత్రలు కొత్తకాదు. రౌడీ ఇన్స్‌పెక్టర్, ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ చిత్రాలు వచ్చిన సమయంలోనే వరుస పోలీస్ పాత్రలు చేశాడు. ఆ తరువాతి చిత్రాల్లోనూ ఏసీపీ, డీసీపీ పాత్రల్నీ పోషించాడు. అయితే, ఈసారి మాత్రం ప్రస్తుత ట్రెండ్ ప్రకారం నెగెటివ్ షేడ్స్ డైమన్షన్‌లో బాలయ్య పాత్రను దర్శకుడు రవికుమార్ తీర్చిదిద్దినట్టు టాక్ వినిపిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios