పరిటాల రవి నాతో అలా అంటే.. అది బాలయ్య సినిమాలో పెట్టా.. ప్రముఖ రైటర్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 22, Aug 2018, 5:33 PM IST
paruchuri gopalakrishna on paritala ravi
Highlights

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ లెక్కలేనన్ని సినిమాలకు కథలను అందించారు. సీనియర్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు చాలా మందితో కలిసి పని చేశారు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ లెక్కలేనన్ని సినిమాలకు కథలను అందించారు. సీనియర్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు చాలా మందితో కలిసి పని చేశారు. నిజజీవితంలో చాలా కథలను, సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకొని తమ సినిమాల్లో వాడుకుంటారు. అలా పరిటాల రవితో జరిగిన ఓ సంఘటనను బాలయ్య సినిమాలో పెట్టినట్లు పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాల కృష్ణ తాజాగా వెల్లడించారు.

''శ్రీరాములయ్య సినిమా షూటింగ్ జరుగుతుండగా, నేను ప్రసాదంగా ఒక లడ్డూని పరిటాల రవికి ఇచ్చాను. ఆయన తినబోతూ ఒక నిమిషం ఆగి.. 'ఎవరిచ్చారన్నా ఇది?' అని అడిగారు. 'మా రెండో అన్నయ్య పంపించారని' చెప్పగా అప్పుడు తిన్నారు. ఎందుకలా అనుమానించారని అడిగాను. దానికి సమాధానంగా.. 'అది కాదన్నా, నువ్వు ఇచ్చింది ఏదైనా నేను తింటాను.. నీ చేతి ద్వారా అది నాకు అందేలా శత్రువులు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది అందుకనే' అంటూ చెప్పారు.

శత్రువు ఎన్ని రకాలుగా రాగలడనే ఈ విషయం నాకు నచ్చి బాలకృష్ణ నటించిన 'సమరసింహారెడ్డి' సినిమాలో పెట్టాను. సినిమాలో బాలయ్య కోసం తెచ్చిన ఆహారాన్ని ముందుగా పృథ్వి తిని ఆ తరువాత ఆయనకు ఇస్తాడని ఆ సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నారు.  

loader