తనపై ప్రెగ్నన్సీ రూమర్స్.. స్టార్ హీరోయిన్ ఎలాంటి సెటైర్లు వేసిందో చూడండి
బాలీవుడ్ స్టార్ బ్యూటీ, ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ స్టార్ బ్యూటీ, ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో తన అందచందాలతో అభినయంతో ఆకట్టుకున్న పరిణీతి చోప్రా ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. వివాహం తర్వాత కూడా పరిణీతి చోప్రా సినిమాలు కొనసాగిస్తోంది.
పరిణితి చోప్రా భర్త పొలిటీషియన్. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో ఎంపీగా ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో పరిణీతి చోప్రా వివాహం జరిగింది. అయితే కొన్ని రోజుల నుంచి ఆమె గురించి రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. పరిణీతి చోప్రా గర్భవతి అంటూ బిటౌన్ మొత్తం కోడై కూసింది. పరిణీతి చోప్రా టీం ఈ వార్తలని ఖండించినప్పటికీ రూమర్స్ ఆగలేదు.
దీనితో స్వయంగా పరిణితి చోప్రా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. తన ప్రెగ్నన్సీ రూమర్స్ ని ఖండించడం మాత్రమే కాదు.. ఇలా పుకార్లు సృష్టించే వారిపై సెటైర్లు వేసింది. కాఫ్టన్ డ్రెస్ వేసుకుంటే.. ప్రెగ్నన్సీ అని రూమర్స్ క్రియేట్ చేస్తారు. కాస్త సైజు ఎక్కువఉన్న డ్రెస్సులు వేసుకున్నా అంతే. ఇండియన్ కుర్తా వేసుకున్నా గర్భవతి అని ప్రచారం చేసేస్తారు అంటూ నవ్వుతున్న ఎమోజిని పరిణీతి చోప్రా షేర్ చేసింది.
స్వయంగా పరిణీతి స్పందించడంతో ఇక ఈ రూమర్స్ కి చెక్ పడ్డట్లు అయింది. గ్లామర్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకున్న పరిణీతి రీసెంట్ గా బిగ్ ఆఫర్ మిస్ చేసుకుంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ చిత్రంలో మొదట హీరోయిన్ గా అనుకున్నది పరిణీతినే. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్లేస్ లోకి రష్మిక వచ్చింది.