'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత దర్శకుడు పరశురాం మరో సినిమా అనౌన్స్ చేయలేదు. దానికి మరో కారణముంది. మహేష్ బాబుతో సినిమా చేయాలనేది పరశురాం ప్లాన్.. మహేష్ కూడా సినిమా చేయడానికి రెడీగానే ఉన్నాడు.

కానీ ప్రస్తుతం అతడు చాలా బిజీగా ఉన్నాడు. అనీల్ రావిపూడి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఆ తరువాత వంశీ పైడిపల్లితో మరో సినిమా ఉంటుంది. ఈ రెండు సినిమాలకు మధ్యలో మహేష్ తో సినిమా చేయాలని పరశురాం పెద్ద ప్లాన్ వేశాడు.

ఇటీవల మహేష్ ని కలిసి కథ కూడా వినిపించాడు. మహేష్ కూడా సినిమా చేస్తానని చెప్పారట. కానీ ఎప్పుడనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. గీతాఆర్ట్స్ లో ఈ సినిమా చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు పరశురాం గీతాఆర్ట్స్ నుండి బయటకి వచ్చేశాడు. దాంతో మహేష్- పరశురాం కాంబినేషన్ లో సినిమా ఉండదేమో అనుకున్నారు. కానీ రీసెంట్ గా మహేష్- పరశురాం భేటీ అవ్వడంతో మహేష్ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు పరశురాం.

ప్రస్తుతం కథను పూర్తి చేసే పనిలో పడ్డాడు. అనీల్ రావిపూడి సినిమా మరో ఆరేడు నెలల్లో పూర్తవ్వడం ఖాయం. వంశీ పైడిపల్లి సినిమా వచ్చే ఏడాది వేసవికి గాని మొదలుకాదు.. దీంతో ఆ మధ్యలో గ్యాప్ ని వాడుకోవాలని పరశురాం ప్లాన్ చేస్తున్నాడు. మరేం జరుగుతుందో చూడాలి!