ఫ్లాఫ్ ల్లో ఉంది సరైన సినిమా దొరక్క ఎడారిలో.. వర్షం కోసం ఎదురుచూస్తున్నట్లుగా కెరీర్ ఉన్న సిట్యువేషన్ లో దర్శకుడు పరుశరామ్ కు ఒయాసిస్సులాంటి ఆఫర్ గీతా ఆర్ట్స్ బ్యానర్ దొరికింది. ఆ బ్యానర్ లో మొదట అల్లు శిరీష్ కు శుభమస్తు వంటి హిట్ ఇస్తే ఆ తర్వాత విజయ్ దేవరకొండ ని హీరోగా పెట్టి గీతా గోవిందం వంటి సూపర్ హిట్ ఇచ్చారు. దాదాపు డబ్బై కోట్ల వరకూ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలు రాయిగా మిగిలిపోయింది.

అయితే ఆ తర్వాత పరుశరామ్ దర్శకత్వంలో ఏ సినిమా మొదలు కాలేదు. అందుకు కారణం పరుశరామ్ ..మంచి స్క్రిప్టు రాసుకుని అల్లు అర్జున్ డేట్స్ కోసం ఎదురుచూడటమే అని తెలుస్తోంది. అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్ దాటి వస్తే చాలా మంది ఆఫర్స్ ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. అయితే పరుశరామ్ కృతజ్ఞతో లేక ఎగ్రిమెంట్ వల్లో ఆ బ్యానర్ ని దాటి రాలేకపోతున్నారు.

రీసెంట్ గా ఓ సూపర్ హిట్ ఇచ్చిన యంగ్ హీరో ...పరుశరామ్ కు వదలలేని ఓ గొప్ప ఆఫర్ ఇచ్చారట. నువ్వు బయిటకు వచ్చి నాతో ఓ సూపర్ హిట్ కొట్టుకో అన్నాడట. పరుశరామ్ ఊగిసలాడుతున్నాడని అంటున్నారు. అయితే బయిటకు వెళ్లి పరుశరామ్ సినిమా చెయ్యాలంటే అల్లు అరవింద్ ఫర్మిషన్ కావాలి. కానీ తమ బ్యానర్ ద్వారా హిట్ కొట్టి...క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు బయిటకు వెళ్లి సినిమా చేస్తే తమకు వచ్చే లాభమేముంటుంది.

అందుకే అల్లు అరవింద్ ఒప్పుకోకపోవచ్చు అంటున్నారు. అంతగా అయితే అదే హీరోని తెచ్చి తమ బ్యానర్ లో సినిమా చేయిస్తారు అని చెప్పుకుంటున్నారు అదీ నిజమే కదా.