సినిమా టక్ తో సంబంధం లేకుండా జనాలను థియేటర్ కి రప్పించగల సత్తా గల నటుడు తారక్. నందమూరి వంశంలలో తాత తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న ఎకైక హీరో తారక్. సినీ పరిశ్రమలో వరుస విజయాలతో, విభిన్నమైన పాత్రలతో దూసుకెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రముఖ సినీ కథా రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికరమైన విషయాన్నిచెప్పుకొచ్చారు.  సుదీర్గమైన సినీ జీవితంలోని అనుభవాలను, అనుభూతులను పరుచూరి పలుకులు అనే మాటలు య్యూటూబ్ ద్వారా పంచుకొంటున్న సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్‌లోని మొండిధైర్యం జూనియర్ ఎన్టీఆర్‌కు వచ్చింది అని పరుచూరి చెప్పారు. 

జూనియర్ ఎన్టీఆర్ పట్టుదల మాటల్లో చెప్పలేం. నటన పట్ల తనకు ఉన్న ఆరాధన తాను ఏ యువ నటుల్లో చూడలేదు. వైజాగ్‌లో ఆది సినిమా క్లైమాక్స్ సీన్లు చిత్రీకరిస్తున్నాం. ఆ సమయంలో తారక్ చేతికి అద్దాలు గుచ్చుకొన్నాయి. అయితే సినిమా షూటింగ్ ఆగిపోతుందిలే అని అనుకొన్నాను.కానీ చేతికి గాయమై రక్తం కారుతున్నా తారక్ అలానే చేసేశారు అని యూనిట్ సభ్యులు చెప్పడంతో నేను కంగుతిన్నాను. వెంటనే నాకు అన్న ఎన్టీఆర్ గారు గుర్తుకు వచ్చారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా షూటింగ్‌ను ఆపడానికి ఎన్టీఆర్ ఇష్టపడేవారు కాదు అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు.

ఆదికి సంబంధించిన ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు తారక్ వచ్చి పక్కకు తీసుకెళ్లాడు. మిమ్మల్ని పెదనాన్న అని పిలవొచ్చా అని అడిగారు. అప్పుడు నాకు కళ్లు చెమర్చాయి. పెదనాన్న అని పిలువమని చెప్పాను. అందరి ముందు అలా తారక్ పిలువగానే భావోద్వేగానికి లోనయ్యా. ఇప్పటికీ నన్ను అలానే పిలుస్తుంటాడు అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పాడు.