పాత కథే మరి వర్కవుట్ అవుతుందా?

pantham movie teaser talk
Highlights

''చెప్పుకోవడానికి ఇదేం కొత్త కథ కాదు.. దేశం పుట్టినప్పటి నుండి మనం చెప్పుకునే కథే..' 

''చెప్పుకోవడానికి ఇదేం కొత్త కథ కాదు.. దేశం పుట్టినప్పటి నుండి మనం చెప్పుకునే కథే..' అంటున్నాడు గోపీచంద్. ఈ మధ్యకాలంలో గోపీచంద్ కెరీర్ కు ఉపయోగపడే ఒక్క సినిమా కూడా రాలేదు. మూస ధోరణిలో సినిమాలు చేసుకుంటూ హీరోగా వెనకబడిపోతున్న గోపీచంద్ ఈసారి 'పంతం' ఫర్ ఎ కాజ్ అంటూ ప్రేక్షకులను పలకరించనున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

ఇందులో.. ''ఫ్రీగా ఇల్లు ఇస్తాం.. కరెంట్ ఇస్తాం.. రుణాలు మాఫీ చేస్తాం అనగానే ఓటుకి 5 వేలు ఇస్తాం అనగానే ముందు.. వెనక.. మంచి.. చెడు.. ఆలోచించకుండానే ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి, కరెప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడ నుంచి వస్తాయ్'' అంటూ గోపీచంద్ పలికిన డైలాగ్ ఆలోచింపజేస్తుంది. దర్శకుడు చక్రవర్తి రూపొందించిన ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా కనిపించనుంది. 

 

loader