Asianet News TeluguAsianet News Telugu

#Aadikeshava: డిజాస్టర్ ‘ఆదికేశవ’..అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్

నవంబర్ 24న ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే మార్నింగ్ షో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 

Panja Vaishnav Tej Aadikeshava shock A Blockbuster on TV jsp
Author
First Published Feb 16, 2024, 11:17 AM IST | Last Updated Feb 16, 2024, 11:17 AM IST

వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), శ్రీలీల(Sreeleela) జంటగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదికేశవ’. మలయాళం స్టార్ నటుడు జోజు జార్జ్ ఇందులో విలన్ గా నటిస్తూ తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ఆదికేశవ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో సంయుక్తంగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కింది. క్రితం సంవత్సరం  నవంబర్ 24న ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే మార్నింగ్ షో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇంత ప్లాఫైన సినిమా టీవీల్లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది..అక్కడ ఎవరైనా చూస్తారా అంటే చిత్రంగా అక్కడ బ్లాక్ బస్టర్ అయ్యింది.

డిజిటల్ ప్రీమియర్ గా నెట్ ఫ్లిక్స్ లోకి  వచ్చిన ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.మొన్న ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ఈ సినిమా ప్రసారం అయ్యింది. టీవీల్లో  కూడా దీనికి ప్రేక్షకుల షాకిస్తారని అంతా భావించారు. కానీ, చిత్రంగా  అదిరిపోయే  రెస్పాన్స్ తెచ్చుకుంది. 'ఆదికేశవ' సినిమాకు అర్బన్ ఏరియాలో 10.47 రేటింగ్ దక్కింది. అలాగే, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలకు సంబంధించి 9.87 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో బెస్ట్ అని చెప్పొచ్చు.
 
టీవీ లో టెలికాస్ట్ అయిన చాలా  సూపర్ హిట్ సినిమాలకు కూడా ఈ స్దాయి రేటింగ్స్ రాలేదు. ఇది ట్రేడ్ కి కూడా పెద్ద షాక్ అనే చెప్పాలి. చిత్రంగా మొదటి నుంచీ పంజా వైష్ణవ్ తేజ్ ట్రాక్ రికార్డు టీఆర్ఫీ రేటింగ్స్ పరంగా చాలా బాగుంది. మొదటి సినిమా 'ఉప్పెన' కి స్టార్ మా ఛానల్ లో మొదటి టెలికాస్ట్ కి దాదాపుగా 16 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. ఇక రెండవ సినిమా 'కొండపొలం' చిత్రానికి అదే ఛానల్ లో దాదాపుగా 9 రేటింగ్స్ వచ్చాయి. ఇప్పుడు 'ఆదికేశవ' చిత్రానికి ఏకంగా 10 రేటింగ్స్ వచ్చాయి. ఈ ట్రాక్ రికార్డు చూస్తుంటే పంజా వైష్ణవ్ తేజ్ ని బుల్లితెర ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు అనేది అర్థం అవుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios