నాలుగు  రోజుల క్రితం మెగా కుటుంబం నుంచి హీరో సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్ వెండితెరకు పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవాన్నిగ్రాండ్ గా మెగా ఫ్యామిలీ హీరోల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీలుక్‌ను  విడుదల చేసింది. 

‘పంజా వైష్ణవ్’ అంటూ వైష్ణవ్ తేజ్ గెటప్‌ను రివీల్ చేశారు. ఇందులో  వైష్ణవ్  మత్య్సకారుడి గెటప్‌లో సముద్రం ఒడ్డున కనిపించారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ హీరో పేరుని  ‘పంజా వైష్ణవ్’ అని పెట్టడమేంటనేది ఎవరికీ అర్దం కాలేదు. 

పంజా అనేది ఇంటిపేరు కాదు...మరి ఎక్కడ నుంచి వచ్చింది అని అంతా హాట్ టాపిక్ గా మారింది. అయితే మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పంజా ని పేరు ముందు పెట్టుకోమని పవన్ సూచించాడు అంటున్నారు. న్యూమరాలిజీ ప్రకారం..'పి' తో పేరు ప్రారంభం కావాలన్నారని.. తన పేరుకు ముందు ఏ పేరు పెడితే బాగుంటుందో అని కుటుంబం అంతా ఆలోచిస్తే పవన్.. పంజా పేరుని సూచించాడంటున్నారు. పంజా అనేది ..పవన్ ఫ్లాఫ్ సినిమా పేరు. అయనా సినిమాకూ దీనికి సంభందం లేదని అలా ఫిక్స్ అయ్యారట. 

మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వాస్తవిక ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది.   ఇక ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్నారు. బుచ్చిబాబు సానా ఇంతకు ముందు సుకుమార్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఇటీవల ‘రంగస్థలం’ చిత్రానికి రైట‌ర్‌గా కూడా పనిచేశారు.

దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు. అలాగే ‘రంగస్థలం’ ఫేమ్ రామకృష్ణ మౌనిక ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను చూసుకుంటుండగా… నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు.