విశాల్ హీరోగా 2005లో వచ్చిన 'పందెంకోడి' సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఎన్.లింగుస్వామి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో విశాల్ కి తెలుగులో మంచి మార్కెట్ సెట్ అయింది. 

విశాల్ హీరోగా 2005లో వచ్చిన 'పందెంకోడి' సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఎన్.లింగుస్వామి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాతో విశాల్ కి తెలుగులో మంచి మార్కెట్ సెట్ అయింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. 'పందెంకోడి2' పేరుతో తెలుగులో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

ట్రైలర్ మొత్తం ఫుల్ యాక్షన్ తో నింపేశారు. విలన్ క్యారెక్టర్ లో వరలక్ష్మి చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో విశాల్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. రాజ్ కిరణ్ ముఖ్య పాత్రలోనటించారు. సినిమాను అక్టోబర్ 18న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.