Asianet News TeluguAsianet News Telugu

ప్రశాంత్‌ దే ఎవిక్షన్‌ పాస్‌.. హౌజ్‌లో బిగ్‌ బాస్‌ భార్య దారుణ హత్య.. రంగంలోకి దిగిన పోలీసులు..

హౌజ్‌లో రెండు గ్రూపులుగా విడిపోయారు. అమర్‌ దీప్‌, ప్రియాంక, శోభా గ్రూపుగా నామినేషన్లపై, శివాజీ వ్యవహారంపై గుసగుసలాడుకున్నారు. ఆ తర్వాత హౌజ్‌లో హత్య జరిగింది.

pallavi prashanth won eviction pass and bigg boss wife murder in biggboss telugu 7 house big shock  arj
Author
First Published Nov 21, 2023, 11:14 PM IST | Last Updated Nov 21, 2023, 11:14 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 7 హౌజ్‌లో మంగళవారం కూడా నామినేషన్ల ప్రక్రియ చోటు చేసుకుంది. మరో ముగ్గురు ఈ రోజు ఎపిసోడ్‌లో తమ నామినేషన్లని వెల్లడించారు. ఇందులో శివాజీ.. గౌతమ్‌, అర్జున్‌లను నామినేట్‌ చేశారు. యావర్‌.. అమర్‌ దీప్‌, అర్జున్‌లను, ప్రియాంక.. యావర్‌, శివాజీలను నామినేట్‌ చేశారు. దీంతో 12వ వారంలో శివాజీ, అర్జున్‌, రతిక, గౌతమ్‌, ప్రశాంత్‌, యావర్‌, అమర్‌ దీప్‌, అశ్విని నామినేట్‌ అయ్యారు. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందనే విషయం తెలిసిందే. 

ఆ తర్వాత హౌజ్‌లో రెండు గ్రూపులుగా విడిపోయారు. అమర్‌ దీప్‌, ప్రియాంక, శోభా గ్రూపుగా నామినేషన్లపై, శివాజీ వ్యవహారంపై గుసగుసలాడుకున్నారు. మరోవైపు శివాజీ, యావర్‌, ప్రశాంత్‌ కలిసి ప్రియాంక గురించి చర్చించుకున్నారు. కాసేపు అటుగా ఉన్న అశ్విని ఆ తర్వాత శివాజీ వైపు వచ్చింది. ఇందులో ప్రియాంక ప్రవర్తనపై శివాజీ కామెంట్‌ చేయడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. తాను తట్టుకోలేకపోతున్నా అంటూ ఆయన్ని ఆయన కవర్ చేసుకునే తీరు ఆసక్తికరంగా సాగింది. ఆ తర్వాత ఎవిక్షన్‌ పాస్‌ కి సంబంధించిన టాస్క్ ఇచ్చాడు. ఇందులో పల్లవి ప్రశాంత్‌ విన్నర్‌గా నిలిచాడు. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ని దక్కించుకున్నాడు. ఎలిమినేషన్‌ నుంచి సేవ్‌ అయ్యాడు. మరి ఆయన దాన్ని ఎలా వాడుకుంటాడో చూడాలి. 

ఆ తర్వాత కంటెస్టెంట్‌ బిర్యానీ పార్టీ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. అర్జున్‌, అమర్‌ దీప్‌ మినహా మిగిలిన వారిని ప్రత్యేకమైన రూమ్‌కి పిలిచి ఫుల్‌ మీల్స్ పెట్టారు. హ్యాపీగా పార్టీ చేసుకోమని తెలిపారు. ఇది బిగ్‌ భార్య ఇచ్చిన విందుగా తెలిపారు. మరోవైపు అర్జున్‌, అమర్‌ లకు టాస్క్ ఇచ్చారు. ఎవరి వద్ద ఎలాంటి ఆహారం ఉంది, హౌస్‌లో ఎంత ఆహారం ఉందో లెక్కించి బిగ్‌ బాస్‌కి తెలియజేయాలని తెలిపారు. అనంతరం పెద్ద షాకిచ్చాడు బిగ్‌బాస్‌. హౌజ్‌లో బిగ్‌ బాస్‌ భార్య హత్యకు గురయ్యిందని తెలిపారు. 

ఆమె వద్ద విలువైన నగలు ఉన్నాయని, అవి మిస్‌ అయినట్టు చెప్పారు. ఈ కేసుని విచారించే బాధ్యతని పోలీసులైన అమర్‌ దీప్‌, అర్జున్‌లకు అప్పగించారు. దీంతో హౌజ్‌లో హత్య వ్యవహారం కలకలం సృష్టించింది. హంతకుడు హౌజ్‌లోనే ఉన్నాడని చెప్పడంతో పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మరి నేరస్థుడిని పట్టుకుంటారా? లేదా అనేది చూడాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios