పలాస 1978 సినిమా క్రిందటి వారం రిలీజైంది. ఓ వర్గం ఆడియన్స్ కు ఈ సినిమా బాగానే నచ్చింది. కలెక్షన్స్ ని ప్రక్కన పెడేతే ఇండస్ట్రీలో ఈ సినిమా గురించిన చర్చ బాగానే జరిగింది. చాలా మంది సినిమా పెద్దలు చూసి మంచి మార్కులు వేసారు.మెచ్చుకున్నారు అదే సమయంలో అల్లు అరవింద్ కూడా ఈ సినిమాని చూసి దర్శకుడు పనితనం చూసి మెచ్చుకుని వెంటనే తన బ్యానర్ లో సినిమా చేయమంటూ ఓ చెక్ ని అడ్వాన్ గా ఇచ్చేసారు. 

 అయితే రిలీజ్ కు ముందు వచ్చిన బజ్ ని,క్రేజ్ ని ఈ సినిమా క్యాష్ చేసుకోలేకపోయింది. మినిమం ఓపినింగ్స్ తెచ్చుకోలేకపోయింది. అదే విధంగా సినిమాకు రావాల్సిన మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టుకోలేకపోయింది. సమర్పుడు తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్సే ఈ సినిమాకు మైనస్ గా నిలిచాయని అంతటా వినిపించింది. ఈ నేపధ్యంలో అల్లు అరవింద్ తన బ్యానర్ లో చేయమంటూ ఇచ్చిన అడ్వాన్స్ వదులుకుంటారా అనే చర్చ మొదలైంది. అయితే అల్లు అరవింద్...ఈ సినిమా హిట్..ప్లాఫ్ లతో తనకు సంభందం లేదని, ఓ స్టార్ హీరోకు కథ చేయగలిగితే తను కథ చెప్పించి, ప్రొడ్యూస్ చేస్తానని హామీ ఇచ్చారట.  ఆ హీరో ఎవరై ఉంటారు..

అల్లు అరవింద్  చెప్తే విని వెంటనే డేట్స్ ఇఛ్చే ఆ హీరో మరెవరో కాదు విజయ్ దేవరకొండ. తన బ్యానర్ లో గీతా గోవిందం వంటి సూపర్ హిట్ ఇచ్చిన విజయ్ దేవరకొండతో ఆయన మరో సినిమా చేయటానికి ఎగ్రిమెంట్ చేసుకుని ఉన్నారట. కరణ్ కుమార్ వర్క్ చూసిన ఆయన ఫక్తు తెలంగాణా యాసలో ఓ స్క్రిప్టు  చేయమని పురమాయించారట.  ప్రస్తుతం కరణ్ కుమార్ ఆ మేరకు ఓ స్టోరీ లైన్ ని రెడీ చేస్తున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగి, విజయ్ దేవరకొండకు స్టోరీ నచ్చితే 2021లో సినిమా పట్టాలు ఎక్కుతుంందిట.