ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌ అంచనాలు పెంచాయి. తాజాగా `పక్కా కమర్షియల్‌` మూవీ మరో ట్రైలర్‌ని విడుదల చేశారు. పవర్‌ ఫ్యాక్డ్ ట్రైలర్‌ ని బుధవారం సాయంత్రం విడుదల చేశారు. 

మ్యాచో స్టార్‌ గోపీచంద్‌(Gopichand) పవర్‌ ప్యాక్డ్ మూవీతో రాబోతున్నారు. ఆయన ప్రస్తుతం `పక్కా కమర్షియల్‌`(Pakka Commercial) చిత్రంతో రాబోతున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. రాశీఖన్నా(Raashi Khanna) ఇందులో గోపీచంద్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. జీఏ 2, యూవీక్రియేషన్స్ పతాకాలపై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. ఈ చిత్రం జులై 1న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ జోరు నడుస్తుంది. ఏపీ, తెలంగాణలో ప్రమోషన్స్ నిర్వహించి సినిమాపై అంచనాలను పెంచారు. 

ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌ అంచనాలు పెంచాయి. ఫుల్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఉండబోతుందని చాటి చెప్పాయి. గోపీచంద్‌, మారుతి మరో క్లాసీ హిట్ కొట్టబోతున్నట్టు అర్థమవుతుంది. నేపథ్యంలో రిలీజ్‌కి ముందు మరో ట్రైలర్‌ని (Pakka Commercial Trailer) విడుదల చేశారు. పవర్‌ ఫ్యాక్డ్ ట్రైలర్‌ ని బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో గోపీచంద్‌ తన విశ్వరూపం చూపించారు. క్లాసూ, మాస్‌, కామెడీ యాంగిల్స్ చూపిస్తూ ఇరగదీశారు. మరోవైపు రాశీఖన్నా సైతం కామెడీ యాంగిల్‌లో కట్టిపడేస్తుంది. 

YouTube video player

ట్రైలర్‌లో `పాతికేళ్ల తర్వాత కోట్‌ వేస్తున్నారంటే ఎంత ఎలివేషన్‌ ఉండాలి` అని రాశీఖన్నా చెప్పడం, `ఆడియెన్స్ తెరమీద చూసి గూస్‌ బంమ్స్ వచ్చి నాట్యమాడాలి వెంట్రుకలు` అని సప్తగిరి చెప్పగా, ఇది `నిజం` అని గోపీచంద్‌ యాక్షన్‌ చేసి చెప్పడం విశేషం. ఆ తర్వాత `జయం`, మా డార్లింగ్‌ `వర్షం` అంటూ మహేష్‌, ప్రభాస్‌, నితిన్‌ సినిమాల పేర్లు చెప్పడం మరో విశేషం. తండ్రి కోడుకులకు విడాకుల ఇప్పించండి అని కోర్ట్ లో రాశీఖన్నా వాదించడం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. చివరగా నోట్లో పాన్‌ వేసుకుని, షర్ట్ మడత పెట్టి దిగితే కటౌట్లు విరగాల్సిందే, ఫ్లెక్సీ చిరగాల్సిందే, మజా వస్తుందని గోపీచంద్‌ చెప్పడం హైలైట్‌గా ఉంది. ఫుల్‌ ప్యాక్డ్ ట్రైలర్‌గా ఇది ఆట్టుకుంటూ వైరల్ అవుతుంది. 

ఇదిలా ఉంటే మహేష్‌ నటించిన `నిజం`లో, ప్రభాస్‌ `వర్షం`, నితిన్‌ `జయం`లో గోపీచంద్‌ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. తాజాగా తన చిత్ర ప్రమోషన్‌ కోసం ఆయా హీరోల పేర్లని గోపీచంద్‌ వాడుకోవడం ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. మరోవైపు సినిమా ప్రమోషన్‌లో భాగంగా రాశీఖన్నా బిజీగా గడుపుతున్నారు. బుధవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆమె.. అనంతరం అక్కడ సత్రంలో భక్తులకు భోజనాలు వడ్డించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ చిత్రంతో తనకు మంచి పేరు రావడంతోపాటు హీరోయిన్‌గా మరో మెట్టు ఎక్కడం ఖాయమంటుంది. 

Scroll to load tweet…