సడెన్ గా పాకిస్తాన్ లోని ఓ రెస్టారెంట్ లో ప్రత్యక్ష్యం అయ్యింది.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. రెస్టారెంట్ లో... అందరికి స్వాగతం పలుకుతుంది. అదేంటి అంతపెద్ద స్టార్ రెస్టారెంట్ లో స్వాగతం పలకడం ఏంటీ..? అది కూడా పాకిస్తాన్ లో.. ఇంతకీ అసలు సంగతేంటంటే...?

బాగా పాపులర్ అయిన సినిమా యాక్టర్స్ ఫోటోలతో పబ్లిసిటీ చసుకునే చిరు వ్యాపారులు చాలా మంది ఉంటారు. అయితే అందరికి అవి వర్కౌట్ అవుతాయి అని లేదు. మరికొంత మందికి మాత్రం ఆ ఫార్ములా అద్భుతంగా వర్కౌట్ అవుతుంటుంది. మన ఇండియాలో ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. బాలీవుడ్ స్టార్స్ ఫోటోలు హోటల్స్ లో, సెలూన్స్ లో, ఇతర షాపుల్లో కనిపిస్తుంటాయి. కాని మన ఇండియన్ స్టార్ పోటోతో ఓ పాకిస్తానీ.. జోరుగా బిజినెస్ చేస్తున్నాడు. 

గుంగూబాయ్ కతియావాడి గుర్తుందా..? అలియాభట్ ఓ వేశ్య నుంచి వేశ్యా కేంద్రం నిర్వాహకురాలిగా ఎదిగే పాత్రతో విమర్శకులను సైతం మెప్పించింది. ఈ సినిమాలో విటులను అలియాభట్ చేతితో సైగ చేస్తూ లోపలికి పిలిచే సీన్ ఉంటుంది. సరిగ్గా ఇదే సీన్ ను పోస్టర్ గా ప్రింట్ చేసి.. తన రెస్టారెంట్ లో పెట్టుకున్నాడు ఓ పాకిస్థానీ.

View post on Instagram

సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనిపై చాలా మంది పాకిస్థాన్ రెస్టారెంట్ వ్యవహారాన్ని తప్పుబడుతున్నారు. అలియాభట్ పోస్టర్ ను వాడుకుంటూ రెస్టారెంట్ కు వచ్చే మగవారికి డిస్కౌంట్లు ప్రకటించడమే వివాదానికి దారితీసింది. 

మెన్స్ మండే పేరుతో కరాచీలోని ఓ రెస్టారెంట్ ప్రకటన ఇచ్చింది. మగవారికి బిల్లులో 25 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ప్రకటనలో ఆజా నా రాజా - దేనికోసం ఎదురు చూస్తున్నావు?. ఆజావో.. మెన్స్ మండే రోజు 25 శాతం డిస్కౌంట్ సొంతం చేసుకో అన్న ట్యాగ్ లైన్ పెట్టాడు. నీవు పెట్టిన సీన్, ఇస్తున్న ఆఫర్ స్త్రీ ద్వేషాన్ని, నీ అజ్ఞానానికి నిదర్శనం అని ఓ యూజర్ మండిపడ్డాడు. ఈ విషయంపై వివాదం చెలరేగుతోంది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.