మోడల్‌పై అత్యాచారం చేయబోయాడు ఓ బిజినెస్‌మేన్. అతడి నుంచి తప్పించుకునే క్రమంలో హోటల్ గది నుంచి కిందికి దూకేసింది. తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న మోడల్‌ని పోలీసులు అరెస్ట్‌ చేయడం మరో షాక్. ఏం జరిగింది? అన్న డీటేల్స్‌లోకి వెళ్తే…సైబీరియాకు చెందిన 23 ఏళ్ల ఎక్టరీనా మోడలింగ్‌లో మంచి పేరు సంపాదించింది. 39 ఏళ్ల ఓ పాకిస్థానీ బిజినెస్‌మేన్‌కి చెందిన కాస్మోటిక్ సంస్థకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోడానికి ఈ మోడల్‌ దుబాయ్‌కి వెళ్లింది. అక్కడ ఓ హోటల్‌లో బస చేసింది. చర్చల పేరుతో ఎక్టరీనాను తన గదికి ఇన్వైట్ చేశాడు యంగ్ బిజినెస్‌మేన్.

ఆమె వెళ్లేసరికి అతడు మద్యం మత్తులో వున్నాడు. ఆ మత్తులో ఆమెపై అత్యాచారం చేయబోయాడని, ప్రతిఘటించడంతో.. చెప్పినట్లు చేయకపోతే చంపేస్తానని ఆ వ్యాపారవేత్త కత్తితో బెదిరించాడని పోలీసులకు తెలిపింది. ”డ్రెస్ విప్పాలంటూ అతడు పైపైకి రావడంతో ప్రాణ భయంతో అతడు చెప్పినట్టే చేశాను. ఆ తర్వాత అతడి నుంచి తప్పించుకునేందుకు హోటల్‌ బిల్డింగ్‌ నుంచి కిందకి దూకేశాను.” అని చెప్పుకుంది. వెన్నెముకకు తీవ్రగాయం కావడంతో హోటల్ సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. మరి.. పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.