యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రంలో బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టించేందుకు సిద్ధం అవుతున్నాడు. సాహో చిత్రం కోసం దేశం మొత్తం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీనితో చిత్ర యూనిట్ క్రమంగా ప్రచారకార్యక్రమాలు వేగవంతం చేస్తోంది. 

ఇటీవల సాహో చిత్ర యూనిట్ సైకో సైయాన్ అంటూ ఓ సాంగ్ ని రిలీజ్ చేసింది. పార్టీ సాంగ్ తరహాలో ఆల్ట్రా స్టైలిష్ గా ఉన్న ఈ పాట ప్రస్తుతం వైరల్ అవుతోంది. కానీ తెలుగు ఆడియన్స్ కి మాత్రం ఈ సాంగ్ అంతా ఎక్కలేదు. ఈ పాట ట్యూన్ బాగానే ఉన్నా లిరిక్స్ లోఆంగ్ల, హిందీ పదాలు డామినేట్ చేసే విధంగా ఉన్నాయి. 

నార్త్ ఆడియన్స్ లో మాత్రం ఈ సాంగ్ కు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఈ పాటకు ఓ పాకిస్తానీ హీరోయిన్ కూడా ఫిదా అయింది. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్న మవ్ర హికెన్.. ప్రభాస్ ని ఉద్దేశించి ట్వీట్ చేసింది. సైకో సైయాన్ హ్యాష్ ట్యాగ్ జతచేస్తూ ట్వీట్ చేసింది. దీనితో ప్రభాస్ పాకిస్తాన్ అభిమానులలో కూడా చర్చనీయాశంగా మారాడు. మవ్ర హికెన్ బాలీవుడ్ లో సనమ్ తేరి కసం చిత్రంలో నటించింది.