లతా మంగేష్కర్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఎన్నో అద్భుతమైన మెలోడీ గీతాలతో లతా మంగేష్కర్ అభిమానులని ఉర్రూతలూగించారు.
ఉత్తరాది గాన కోకిల లతా మంగేష్కర్(Lata Mangeshkar) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆదివారం తుదిశ్వాస విడిచారు. గత నెల మొదటి వారం నుంచి హాస్పిటల్ లోనే ఉన్న లతాజీ.. మరోసారి విషమ పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. కరోనాతో గత నెల 8న ముంబై లోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేరిన లతా(Lata Mangeshkar)జీ.. అప్పటి నుంచి ఐసీయూలోనే ట్రిట్ మెంట్ తీసుకుంటున్నారు.
ఈ మధ్య ఆమె ఆరోగ్యం కుదుటపడ్డట్టు డాక్టర్లు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరోసారి ఆమె ఆరోగ్యం విషమంగా మారింది. దీనితో ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. లతా మంగేష్కర్ మరణ వార్త విన్న ప్రముఖులంతా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అభిమానులు శోకంలో మునిగిపోయారు. 70 ఏళ్లకు పైగా కెరీర్ కొనసాగించిన లతా మంగేష్కర్ ని భారత ప్రభుత్వం భారత రత్న అవార్డు తో సత్కరించిన సంగతి తెలిసిందే.
లతా మంగేష్కర్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఎన్నో అద్భుతమైన మెలోడీ గీతాలతో లతా మంగేష్కర్ అభిమానులని ఉర్రూతలూగించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ఇలా ప్రముఖులంతా లతా మంగేష్కర్ మృతికి సంతాపం తెలియజేశారు.
ఇక పాకిస్తానీ మంత్రి ఫవాద్ హుస్సేన్ కూడా లతా మంగేష్కర్ మృతికి సంతాపం తెలిపారంటే ఆమె ఖ్యాతి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. లతా మంగేష్కర్ పై ఎల్లలు దాటిన అభిమానానికి ఇదొక ఉదాహరణ.
ఫవాద్ హుస్సేన్ పాకిస్తాన్ లో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ శాఖకు మంత్రిగా పనిచేస్తున్నారు. 'లెజెండ్ ఇక లేరు.. సంగీత ప్రపంచాన్ని శాసించిన మెలోడీ క్వీన్ లతా మంగేష్కర్. దశాబ్దాలుగా ఆమె సంగీతంలో మకుటం లేని మహారాణిగా మన హృదయాల్ని పాలించారు. ఆమె ఎప్పటికి మనందరి హృదయాల్లోనే ఉంటారు' అంటూ ఫవాద్ హుస్సేన్ లతా మంగేష్కర్ కి సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
