వర్ధమాన మ్యూజిక్ కంపోజర్స్ సుమంత్ బొర్రా, వెంకటేష్ ఉప్పల మరో రొమాంటిక్ సాంగ్ 'పడిపోయా' తో వచ్చేస్తున్నారు. ఈ సాంగ్ టీజర్ విడుదల కాగా అంచనాలు పెంచేస్తుంది.
ఇండిపెండెంట్ మ్యుజీషియన్స్ సుమంత్ బొర్ర, వెంకటేష్ వుప్పల రొమాంటిక్ సాంగ్ కంపోజర్స్ గా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వీరు స్వరపరిచిన ''ఇలా మరి ఇక రావా..'' సాంగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ప్రముఖ మ్యూజిక్ లేబిల్ ఆదిత్య వీరి సాంగ్స్ ని ప్రెజెంట్ చేస్తుంది.

''ఇలా మరి ఇక రావా..'' బ్లాక్ బస్టర్ సక్సెస్ అనంతరం వీరి కాంబినేషన్ లో ''పడిపోయా..'' అనే మరో లవ్ రొమాంటిక్ మెలోడీ రూపొందింది. ఈ ప్రైవేట్ సాంగ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా అంచనాలు పెంచేస్తుంది. ఉపేంద్ర కుమార్, వైష్ణవి రెడ్డి నటించగా.. పూర్తి సాంగ్ జులై 29న విడుదల కానుంది. ఈ సాంగ్ కి డైరెక్షన్ అండ్ డీఓపీ నవీన్ కుమార్ కమతం అందించారు. సాహిత్యం మల్లిక వల్లభ పిట్ల అందించారు.
