శర్వానంద్ - సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం పడి పడి లేచే మనసు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ గా చిత్ర యూనిట్ సెన్సార్ పనులను కూడా పూర్తి చేసింది చివరలో కొంత ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఆలస్యం అవుతున్నట్లు టాక్ వచ్చినప్పటికీ అనుకున్న సమయానికి పని పూర్తి చేశారు. 

ఇక సెన్సార్ బోర్డు పడి పడి లేచే మనసుకు క్లీన్ 'U' సర్టిఫికెట్ ను జారీ చేసింది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని టాక్ వస్తోంది. సెన్సార్ సభ్యుల నుంచి కూడా చిత్ర యూనిట్ కి ప్రశంసలు అందాయి. ఈ లవ్ ఎంటర్టైనర్ లో ఎక్కువగా రొమాంటిక్ డోస్ లేకుండా దర్శకుడు మనసును తాకే విధంగా ప్రేమికుల మధ్య ఉండే పరిస్థితుల గురించి వివరించాడట. 

ఒకసారి దగ్గరైన ప్రేమికులు ఆ తరువాత జరిగే పరిస్థితులకు ఎలా మారిపోతారు అనే కోణంలో సీన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగిస్తాయట. గతంలో శర్వా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాతో ఎలాగైతే మెప్పించాడో అంతకంటే ఎక్కువ స్థాయిలో ఈ సినిమాతో అలరిస్తాడని తెలుస్తోంది. ఇక తోడుగా సాయి పల్లవి నటన హైలెట్ గా నిలవనుందని సమాచారం. డిసెంబర్ 21న శుక్రవారం సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.