Asianet News TeluguAsianet News Telugu

విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవ‌డం అనే స్కీమ్ సినిమావాళ్లకు తెలిసినంత‌గా ఇంకెవ‌రికీ తెలీదేమో. హిట్ రాగానే లెక్కలు మారిపోతాయి. అలాంటిది వరస పెట్టి హిట్స్ వస్తే ఇంక చెప్పేదేముంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ పరిస్దితి అలాగే ఉంది. 

Outrage Hike In Remuneration Of Vijay Devarakonda?!
Author
Hyderabad, First Published Dec 14, 2018, 7:46 AM IST

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవ‌డం అనే స్కీమ్ సినిమావాళ్లకు తెలిసినంత‌గా ఇంకెవ‌రికీ తెలీదేమో. హిట్ రాగానే లెక్కలు మారిపోతాయి. అలాంటిది వరస పెట్టి హిట్స్ వస్తే ఇంక చెప్పేదేముంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ పరిస్దితి అలాగే ఉంది. 

2018లో విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం,టాక్సీవాలా,మహానటి సినమాలు పెద్ద హిట్ అయ్యాయి. నోటా ప్లాఫ్ అయినా మంచి ఓపినింగ్స్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో యూత్ లో విజయ్ దేవరకొండ క్రేజ్ పీక్స్ కు చేరింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే త‌న రెమ్యునరేషన్ విష‌యంలో ప‌ట్టు బ‌డుతున్నారు. భారీగానే పెంచి సంచ‌ల‌నం రేపుతున్నారు.  

విజ‌య్ దేవ‌ర కొండ త‌న మొదటి సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో నటించినందుకు కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమే రెమ్యునేషన్ గా అందుకున్నాడు. ఆ తర్వాత నటించిన ‘పెళ్లి చూపులు’కు కూడా విజయ్‌ రెమ్యునరేషన్‌ ఆరు లక్షలేనట. ఆ తర్వాత వచ్చిన ‘ద్వారకా’, ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాలకు రూ. 20 లక్షలు తీసుకున్నాడట. 

యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో విజయ్‌  చేసిన హారర్‌ కామెడీ టాక్సీవాలా కోసం  రూ. 80 లక్షలు అందుకుంటున్నాడట.  తాజాగా క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా కోసం ఏడున్నర కోట్లు రెమ్యునేషన్  తీసుకుంటున్నాడని సమాచారం. ఇలా తన భాక్సాపీస్ క్రేజ్ ని బట్టి రెమ్యునరేషన్ పెంచుకుంటూ వస్తున్న విజయ్ దేవరకొండ ఇకపై అంగీకరించే ప్రాజెక్టులకు మాత్రం 9 కోట్లు  అడగాలని డిసైడ్‌ అయ్యాడట. 

ఈ రెమ్యునరేషన్ ఎక్కువా అంటే...ఓ ఆర్టిస్ట్‌కు ఉన్న మార్కెట్‌ను బట్టే రెమ్యునరేషన్‌ ఇస్తారని, ఎంత అడిగితే అంత ఎవరూ ఇవ్వరని అంటున్నాడు విజయ్‌ దేవరకొండ. మొత్తంగా విజ‌య్ ధీమా చూస్తుంటే త‌న మార్కెట్ గురించి ఆయ‌న కరెక్ట్ గానే అంచ‌నా వేస్తున్నారని  తెలుస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios